ఔదార్యాన్ని చాటిన ఆదివాసీ నాయకుడు పెండకట్ల యాకయ్య
22-08-2026 07:10 PM
ఇల్లెందు,(విజయక్రాంతి): ఇల్లెందు మండలం లచ్చగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని కొమ్ముగూడెం గ్రామంలో ఇటీవల విద్యుత్ ఘాతంతో ఇల్లు పూర్తిగా దగ్ధమైన విషయం తెలుసుకున్న ఆదివాసీ నాయకుడు పెండకట్ల యాకయ్య శనివారం గ్రామానికి చేరుకున్నారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించి 150 కిలోల బియ్యం, రూ.3 వేల ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా పెండకట్ల యాకయ్య మాట్లాడుతూ.. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. బాధిత కుటుంబానికి అండగా నిలిచేందుకు తనవంతు సహాయం అందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సలీం, శోభన్, నరేష్, రవి తదితరులు పాల్గొన్నారు.






