22 August, 2026 | 8:17 PM

ప్రమాదకర గుంతను పూడ్చివేయించిన కౌన్సిలర్ జాలిగం విఘ్నేష్

22-08-2026 07:15 PM

ఆలేరు: భువనగిరి పట్టణంలోని నల్లగొండ చౌరస్తా వద్ద ప్రమాదకరంగా మారిన గుంతను మున్సిపల్ సిబ్బంది సహకారంతో 22వ వార్డు కౌన్సిలర్ జాలిగం విఘ్నేష్ పూడ్చివేయించారు. దీంతో వాహనదారులు, స్థానిక ప్రజలకు ఇబ్బందులు తొలగాయి. అదేవిధంగా చౌరస్తా వద్ద నెలకొన్న డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు బాక్స్ డ్రైన్ నిర్మించాలని కౌన్సిలర్ విఘ్నేష్ మున్సిపల్ చైర్‌పర్సన్ తంగళ్లపల్లి శ్రీవాణిని కోరారు.

డ్రైనేజీ సక్రమంగా లేకపోవడంతో నీరు రోడ్డుపైకి చేరి చెరువును తలపించే పరిస్థితి ఏర్పడుతోందని, వాటర్ బాటిళ్లు, ఇతర చెత్తాచెదారం కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కౌన్సిలర్ విజ్ఞప్తిపై చైర్‌పర్సన్ తంగళ్లపల్లి శ్రీవాణి సానుకూలంగా స్పందించి, సమస్య పరిష్కారానికి అధికారులకు తగిన సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో పీసీసీ డెలిగేట్ తంగళ్లపల్లి రవికుమార్, ఇంజినీర్ రంజిత్, స్థానిక నాయకులు తోట కార్తిక్, ప్రమోద్, బర్రె క్రాంతి, యాదగిరి, శ్రీధర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.