23 June, 2026 | 12:00 PM

ప్రైవేట్ స్కూల్ నుంచి సర్కార్ బడికి సర్పంచ్ కూతురు

23-06-2026 10:47 AM

ఆదర్శంగా నిలిచిన విశ్వనాథపల్లి సర్పంచ్ రాజు

కారేపల్లి, (విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని ప్రసంగాలకే పరిమితం కాకుండా ప్రైవేటు స్కూల్లో చదువుతున్న తన కూతురును ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి ఆదర్శంగా నిలిచారు కారేపల్లి మండలంలోని విశ్వనాథపల్లి సర్పంచ్ ఇస్లావత్ రాజు. సర్పంచ్ కూతురు ఇస్లావత్ రవళి ఓ ప్రైవేటు స్కూల్లో చదువుతోంది. విశ్వనాథపల్లి జిల్లాపరిషత్ హైస్కూల్ ఉపాధ్యాయ బృందం ఇటీవల నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో గ్రామంలో ప్రదర్శన నిర్వహించి ప్రతీ ఇంటికి వెళ్లారు. ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమానికి ఆకర్షితుడైన సర్పంచ్ ప్రభుత్వ పాఠశాల పై ప్రజలకు నమ్మకం కల్పించాలని తన కూతురును ప్రభుత్వ బడిలో చేర్చేందుకు నిర్ణయించుకున్నాడు.విశ్వనాథపల్లి జిల్లాపరిషత్ హైస్కూల్ లో మంగళవారం చేర్పించారు. స్కూల్లో చేరిన రవళికి పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలను హెడ్మాస్టర్ పద్మ అందజేసి ఆదర్శంగా నిలిచిన సర్పంచ్ రాజును అభినందించారు.