23 June, 2026 | 1:12 PM

Breaking News

ఉప సర్పంచ్ల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లండి

23-06-2026 11:40 AM

బోథ్, జూన్ 23 (విజయకాంత్రి): గత ప్రభుత్వ హయాంలో ఉప సర్పంచ్లకు చెప్పవ ఇవ్వడంతో పాటు కొన్ని అధికారాలు కల్పించిందని అయితే ఈ ప్రభుత్వం ఉప సర్పంచ్ల చెప్పవ రద్దు చేసేందుకు ఆలోచిస్తున్నాను .ఈ విషయమై ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని స్థానిక శాసనసభ్యులు అనిల్ కు ఉప సర్పంచ్ల సంఘం సభ్యులు విన్నవించారు.

ఉప సర్పంచ్ ఒక సైతం గౌరవేతనం 5000 రూపాయలు వార్డు సభ్యులకు 3000 రూపాయలు అందించాలని కోరారు.ప్రభుత్వ కార్యక్రమాలలో శిలాఫలకంపై పేర్లు రాయాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉప సర్పంచుల సమస్యలను ప్రభుత్వం సృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. ఎమ్మెల్యేలు వినతి పత్రం ఇచ్చిన వారిలో ఉప సర్పంచ్ల సంఘం మండల గౌరవ అధ్యక్షులు మనోహర్ అధ్యక్షులు రామచందర్ రెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్ గణేష్ కోశాధికారి సుభాష్ ఉపాధ్యక్షులు సెక్స్ సనావుల్లా జనరల్ సెక్రెటరీ సాయి చరణ్ రెడ్డి సలహాదారుడు విజయ్ తో పాటు పలు గ్రామాలకు ఉప సర్పంచ్ కు పాల్గొన్నారు.