23 June, 2026 | 12:00 PM

విద్యుత్ శాఖ నిర్లక్ష్యానికి నిలువుటద్దం

23-06-2026 10:27 AM

విద్యుత్ శాఖ నిర్లక్ష్యానికి నిలువుటద్దం 

220 కేవీ లైనుకు అల్లుకున్న చెట్ల తీగలు 

భద్రాద్రి కొత్తగూడెం, (విజయక్రాంతి): విద్యుత్ శాఖ నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా మారింది 220కె వి లైన్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండల పరిధిలోని పాండురంగాపురం మార్గంలో గల 220 కె వి విద్యుత్తు లైను స్తంభాలకు చెట్ల తీగలు అలుముకొని ప్రమాదాన్ని పొంచి ఉన్నాయి. ఎప్పటికప్పుడు జంగిల్ కటింగ్ చేయాల్సిన విద్యుత్ శాఖ నిద్రావస్థలో ఉన్నట్లు తేటతెల్లమవుతుంది. ప్రమాదం జరిగితే బాధ్యులు ఎవరు అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా విద్యుత్ స్తంభాలకు అలుముకున్న తీగలను తొలగించి ప్రమాదాన్ని నివారించాలని డిమాండ్ చేస్తున్నారు.