23 June, 2026 | 12:57 PM

Breaking News

హలో ఉప సర్పంచ్ - ''చలో హైదరాబాద్" కార్యక్రమాన్ని విజయవంతం చేయండి

23-06-2026 11:36 AM

మానకొండూర్ లో చలో హైదరాబాద్ పోస్టర్ ఆవిష్కరించిన మండల ఉప సర్పంచ్ లు

మానకొండూరు,జూన్ 23(విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా మండల కేంద్రమైన మానకొండూరులో, మండల ఉపసర్పంచుల ఫోరం అధ్యక్షులు గడ్డి గణేష్ ఆధ్వర్యంలో  మండల స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉప సర్పంచ్ ల ఫోరం కరీంనగర్ జిల్లా కోఆర్డినేటర్ ఆకు బత్తిని విజయ్ కుమార్ హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం ఉప సర్పంచ్ లకు చెక్ పవర్ రద్దు ఆలోచనను విరమించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈనెల 25న నిర్వహించే హలో ఉప సర్పంచ్ ల 

చలో హైదరాబాద్  కార్యక్రమానికి మండలంలోని ఉపసర్పంచ్ లు అందరూ హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి సంబంధించి, మండల ఉపసర్పంచ్ లతో కలిసి, గోడ ప్రతులను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ల ఫోరం మండల ప్రధాన కార్యదర్శి రాపాక ప్రవీణ్, ఉపాధ్యక్షులు మర్రి కుమారస్వామి, ఈడుముల సంపత్, వేల్పుల కొమురయ్య వివిధ గ్రామాల ఉపసర్పంచులు  ఆడెపు రమేష్, మేకల మహేందర్, ముడగాని అనిల్ గౌడ్, కాల్వ శ్రీనివాస్ యాదవ్, పొలవేణి రాజేష్, జిల్లెల్ల రాజు, తదితరులు పాల్గొన్నారు.