15 June, 2026 | 2:27 PM

Breaking News

పెద్దపల్లిలో కాంగ్రెస్ బూత్ లెవెల్ ఏజెంట్ల శిక్షణ తరగతులు   •   తెలంగాణ ఏర్పాటును ఏనాడూ జనసేన వ్యతిరేకించలేదు   •   ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి   •   మొదటి రోజున నూతనంగా చేరిన విద్యార్థులకు ఘనస్వాగతం   •   ప్రభుత్వ విద్యపై భరోసా.. కొడుకును ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన మచ్చుపేట సర్పంచ్   •   కర్కోటక కాంగ్రెస్ ప్రభుత్వం.. బెల్లంపల్లిలో కవిత హల్‌చల్‌   •   తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సబ్ కమిటీ సమావేశం   •   కార్మికుల దీక్షలకు స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ప్రత్యక్ష మద్దతు ఇవ్వాలి   •   యోగ దినచర్యలో భాగం కావాలి: జిల్లా ప్రోగ్రాం అధికారి   •   మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు ఫిషరీస్ భూమి సర్వే పూర్తి   •  

ఈదురు గాలులతో రోడ్డుపై పడిన చెట్టు తొలగించిన సర్పంచ్

13-06-2026 05:25 PM

బెజ్జంకి: బెజ్జంకి మండలం వీరపూర్ గ్రామంలో శుక్రవారం సాయంత్రం వీచిన బలమైన ఈదురు గాలుల కారణంగా విద్యుత్ వైర్లపై ఉన్న చెట్ల కొమ్మలు విరిగి రోడ్డుపై పడ్డాయి. దీంతో గ్రామంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడటంతో పాటు ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయి. విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ చిలుముల సతీష్ వెంటనే స్పందించి స్థానిక యువకులు, గ్రామస్తుల సహకారంతో రోడ్డుపై పడిన చెట్టు కొమ్మలను తొలగించి మార్గాన్ని పూర్తిగా శుభ్రం చేయించారు. దీంతో రాకపోకలు యథావిధిగా పునరుద్ధరించబడ్డాయి. ఈ సందర్భంగా సర్పంచ్ చిలుముల సతీష్ మాట్లాడుతూ, వర్షాకాలంలో ఈదురు గాలులు, భారీ వర్షాల వల్ల ప్రమాదాలు సంభవించే అవకాశం ఉన్నందున గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విద్యుత్ వైర్లు లేదా చెట్లు ప్రమాదకరంగా కనిపించిన వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని కోరారు.