మంత్రి చేతుల మీదుగా లోగో ఆవిష్కరణ
13-06-2026 05:23 PM
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు జిల్లా ఇన్చార్జ్ జూపల్లి కృష్ణారావు, డా కొత్తపల్లి సుజ్ఞాన్ MD కేబి హోమియోకేర్ లోగో ఆవిష్కరణ చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆరోగ్య పరిరక్షణకు హోమియో వైద్యం కూడా ఎంతో ప్రాధాన్యత కూడిందని మంత్రి వివరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, మాజీమంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాల చారి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి శ్రీహరి రావు. జిల్లా గ్రంథాలయ చైర్మన్ అర్జున్, మున్సిపల్ వైస్ చైర్మన్ గణేష్ చక్రవర్తి చక్రవర్తి మాజీ జెడ్పిటిసి కొత్తపల్లి బుచ్చన్న గంగామణి స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.






