24 March, 2026 | 10:21 PM

విద్యుత్ షాక్ తో మరణించన వ్యక్తికి భీమా చెక్కు అందజేత

24-03-2026 08:38 PM

మఠంపల్లి,(విజయక్రాంతి): మఠంపల్లి మండలంలోని కొత్త దొనబండ తండా గ్రామ పంచాయతీకి చెందిన బాణోతు తావు తండ్రి పెద్ద బిక్ష్యం గత ఏడాది పొలంలో విద్యుత్ షాక్ తో పొలంలో మరణించడం జరిగింది.మంగళవారం హుజూర్ నగర్ విద్యుత్ శాఖ కార్యాలయంలో ఏడి నాగిరెడ్డి,ఏఈ హరిష్ రెడ్డి, స్థానిక సర్పంచ్లు బానోతు అరుణా దేశ్ పాండు నాయక్,మాలోతు సక్రు నాయక్ ఆధ్వర్యంలో ఐదు లక్షల భీమా చెక్కును కుటుంబ సభ్యులకు అందజేశారు.

ఈ సందర్భంగా సర్పంచ్లు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు ఉత్తంకుమార్ రెడ్డి సహాయ సహకారంతో ఐదు లక్షల విద్యుత్ శాఖ వారి ప్రమాద భీమ చెక్కు అందజేయడం సంతోషకరమని తెలిపారు.ఈ కార్యక్రమంలో డివిజనల్ సబ్ ఇంజనీరింగ్ అశోక్, సర్పంచ్లు జమ్మమంద నాయక్, గోవింద్, చిరంజీవి,కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు నాగరాజు  జయరాంకృష్ణ,పూర్ణచందర్, చంద్రశేఖర్ తదితరులు  పాల్గొన్నారు.