ఇరు పార్టీల మధ్య ఇసుక రచ్చ..
* గాంధారి పల్లిలో జోరుగా సాగుతున్న ఇసుక తవ్వకాలు
* కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల మధ్య గొడవ
* ఎమ్మార్వో స్పందించకపోవడంతో కలెక్టర్ కు ఫిర్యాదు
* పీఎస్ లో ఫిర్యాదు చేశామన్న నాయకులు
పాపన్నపేట: అధికార పార్టీ నాయకులు జోరుగా ఇసుక తవ్వకాలు చేపట్టడంతో బీఆర్ఎస్ నాయకులు ఇసుక ట్రాక్టర్లను అడ్డుకోగా ఇరుపార్టీల నాయకుల మధ్య గొడవ రేకెత్తింది. పరస్పరం గొడవ పడడంతో రచ్చ పోలీస్ స్టేషన్ కు చేరింది. మండల పరిధిలోని గాంధారి పల్లి శివారులో ఉన్న మంజీరా నుంచి కాంగ్రెస్ నాయకులు జెసిబి, ట్రాక్టర్లతో ఇసుకను తోడేస్తున్నారు.
దీంతో మంగళవారం గ్రామ బీఆర్ఎస్ నాయకులు ట్రాక్టర్లను అడ్డుగోగా ఇరు పార్టీల నాయకుల మధ్య గొడవ జరిగింది. ఇసుక తవ్వకాలపై స్థానిక ఎమ్మార్వో కు ఫిర్యాదు చేసిన స్పందించకపోవడంతో కలెక్టర్ కు సైతం గ్రామ బీఆర్ఎస్ నాయకులు ఫిర్యాదు చేశారు. ఇసుక అక్రమ రవాణాను అధికారులు తక్షణమే స్పందించి ఆపివేయాలని వారు కోరుతున్నారు.




