24 March, 2026 | 8:46 PM

Breaking News

విద్యుత్ షాక్ తో మరణించన వ్యక్తికి భీమా చెక్కు అందజేత   •   ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల క్షేత్ర పర్యటన   •   జన గణనను పకడ్బందీగా పూర్తి చేయాలి   •   ప్రభుత్వానికి నాణ్యమైన సమాచారం అందించేలా కృషి చేయాలి   •   ప్రభుత్వ ఆసుపత్రిలో మౌలిక సదుపాయాల కల్పనకు సత్వర చర్యలు   •   సంత నిర్వాహణ వేలంలో పెరిగిన ఆదాయం 5.02 శాతం మాత్రమే   •   జిల్లాను క్షయ వ్యాధి రహిత జిల్లాగా తీర్చిదిద్దుదాం   •   ద్వారకుంటలో సిసి రోడ్డు శంకుస్థాపన: సర్పంచ్ పాలకి సురేష్   •   ఖైదీలకు బెయిల్ విషయంలో సహాయం చేయడమే సాధికార కమిటీ ఉద్దేశ్యం   •   కోనరావుపేట 10వ వార్డ్‌లో పారిశుధ్య సమస్యలు   •  

సంత నిర్వాహణ వేలంలో పెరిగిన ఆదాయం 5.02 శాతం మాత్రమే

24-03-2026 07:37 PM

* గతేడాది సంత వేలం రూ. 37.04 లక్షలు.. ఈ సారి రూ. 39.01 లక్షలు

* తైబజార్ వేలం రూ. 10.99 లక్షలకు దక్కించుకున్న శ్రీనువాసులు

అచ్చంపేట: అచ్చంపేట మున్సిపాలిటీ ప్రధానమైన ఆదాయ వనరుల్లో పశువు, మేకల సంత, తైబజార్ వేలం అత్యంత ముఖ్యమైనవీ.  అంతటి ప్రాధాన్యత కలిగిన వాటిని కొంత మంది ముందే సిండికేటుగా మారి కారుచౌకగా దక్కించుకున్నారు. దీనికి ఓ ప్రజాప్రతినిధి సహకరించాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో మున్సిపల్ ఆదాయానికి భారీగా గండిపడినట్లైంది. కాగా మున్సిపాలిటీకి వచ్చే ఆస్తి, ఇంటి పన్ను, ఆదాయం కేవలం సిబ్బంది వేతనాలు, కార్యాలయ నిర్వాహణకే సరిపోతోందని అనేక మార్లు అధికారులు చెప్పిన సమాదానం.

నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పురపాలక సంఘం పరిధిలో 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తై-బజార్, పశువులు, మేకలు, గొర్రెల సంత నిర్వాహణ,  తైబజార్, చికెన్ వ్యర్థాల సేకరణకు మంగళవారం టెండర్ వేలం నిర్వహించారు. మున్సిపల్ చైర్మన్ గార్లపాటి శ్రీనివాసులు అధ్యక్షతన నిర్వహించారు. కమిషనర్ మురళి, మేనేజర్ రమేశ్ నాయక్ సంత, తైబజార్ నిర్వాహణ విధి విధానాలు, ఇతర అంశాలను చదివి వినిపించారు. 

* సంత వేలం రూ. 39.01 లక్షలు

పశువు, గొర్రె, మేకల సంతకు నిర్వహించిన టెండర్ వేలంలో అయిదుగురు పాల్గొన్నారు. వేలాన్ని అచ్చంపేటకు చెందిన జగ్జీవన్ రావ్ రూ.39,01,000లకు దక్కించుకున్నారు. గతేడాది ఇదే వేలం రూ. 37.04,816 పలికింది. కానీ ఈ సారి నిర్వహించిన వేలంలో కేవలం అధనంగా 5.02 శాతం అంటే.. రూ. 1.96 లక్షలు ఆదాయం వచ్చింది. వేలంలో పాల్గొన్న వ్యక్తులు ముందుగానే సిండికేటుగా మారారు.

ఈ వేలంలో ఓ ప్రజాప్రతినిధి సైతం భాగస్వామిగా ఉండటంతో అందరు కలిసి సిండికేటుగా మారి టెండర్ వేలంలో పాల్గొన్నట్లుగా ఆరోపణలు ఉన్నాయి. పైగా గతేడాది పోలిస్తే మేకలు, గొర్రెలు నుంచి వసూళు చేసే రుసుమును భారీగా పెంచారు. దీని వలన టెండర్ దక్కించుకున్న గుత్తేదారునికే లాభం చేకూరనుండగా.. మున్సిపాలిటీకి వచ్చే ఆదాయం మాత్రం పెద్దగా పెరిగిందేమీ లేదు. అలాగే  తైబజార్ నిర్వాహణను వేలంలో తొంబర్ల శ్రీనువాసులు రూ. 10.99 లక్షలకు దక్కించుకున్నారు. సరైన దరఖాస్తులు రానందునా చికన్ వ్యర్థాల వేలాన్ని వాయిదా వేశారు. 

* నిబంధనలు మీరితే రద్దు: ఛైర్మన్

ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల మేరకు సంత, తైబజార్ నిర్వాహణ చేపట్టాలని మున్సిపల్ ఛైర్మన్ గార్లపాటి శ్రీనువాసులు తెలిపారు. నిబందనలు అతిక్రమిస్తే అనుమతులు రద్దు చేసి.. తిరిగి వేలం నిర్వహిస్తామని హెచ్చరించారు. సంత వద్ద కనీస వసతులు కల్పించాలని గుత్తేదారుకు సూచించారు.