11-02-2026 03:56:39 PM
బెల్లంపల్లి,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మునిసిపల్ ఎన్నికల్లో ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మాజీ ఎమ్మెల్యే అమురాజుల శ్రీదేవి, మున్సిపల్ మాజీ చైర్మన్ అమురాజుల రాజేశ్వర్ కుటుంబసమేతంగా వెళ్లి ఓటు హక్కును వినియోగించుకున్నారు. 23 వార్డు ప్రభుత్వ బాలికల హైస్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి, మున్సిపల్ మాజీ చైర్మన్ ఆమ్రాజుల రాజేశ్వర్ ఓటు వేశారు.