27 June, 2026 | 7:29 PM

Breaking News

నిజామాబాద్ జీపీవోపై గ్రామస్తుల ఫిర్యాదు   •   నిరుపేదల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ముఖ్య లక్ష్యం   •   క్యూబాపై అమెరికా ఆంక్షలు ఎత్తివేయాలి   •   సోనాల మండల కేంద్రంలో పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయండి   •   మొక్కలు నాటడం మున్సిపాలిటీ వంతు.. రక్షణ దేవుడి వంతు   •   జిల్లా బిజెపి (ఓబీసీ) రూరల్ అధ్యక్షులుగా మహేందర్ యాదవ్ ఎన్నిక   •   అంబర్పేటలో ఘనంగా డాక్టర్ గునిగంటి ప్రభాకర్ రావు జన్మదిన వేడుకలు   •   గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన ప్రత్యేక అధికారి   •   అరకొర వసతుల మధ్య సాంఘిక సంక్షేమ హాస్టల్ భవనాన్ని చూసి హాస్టల్లో రామంటున్న విద్యార్థులు   •   విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోంది   •  

బండి ముత్తమ్మకు సండ్ర ఘన నివాళి

13-04-2026 05:30 PM

కల్లూరు,(విజయక్రాంతి): మండల పరిధిలోని రఘునాథ బంజర గ్రామానికి చెందిన బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు బండి నరసింహారావు మాతృమూర్తి బండి ముత్తమ్మ దశదిన కార్యక్రమం సోమవారం నిర్వహించబడింది. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య హాజరై ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం దుఃఖంలో ఉన్న కుటుంబ సభ్యులను ఓదార్చిన సండ్ర వెంకట వీరయ్య,కుటుంబ సభ్యులందరూ ధైర్యంగా ఉండాలని సూచిస్తూ తమ సానుభూతిని వ్యక్తం చేశారు. ఈ సంతాపభరిత వాతావరణంలో ముత్తమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని పలువురు ప్రార్థించారు.

కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి కట్ట అజయ్ బాబు, కల్లూరు మున్సిపాలిటీ కౌన్సిలర్ పెడకండి రామకృష్ణ, కాటమనేని వెంకటేశ్వరరావు, కుసునూరు శ్రీనివాసరావు, కావటి నరసయ్య, మాజీ సర్పంచ్ కుక్క అంజన్ రావు, ఉప సర్పంచ్ చల్లగుండ్ల వెంకటేశ్వరరావు, ఖమ్మంపాటి లక్ష్మణరావు, వార్డు సభ్యులు పొనుగుమాటి శ్రీనివాసరావు, బలుసుపాటి జగ్గయ్య,కుక్క మారేశ్వరరావు,జానపాటి రామారావు, బంధువులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.