15 August, 2026 | 5:14 PM

ఘనంగా సండ్ర జన్మదిన వేడుకలు

15-08-2026 04:27 PM

భారీ కేక్‌ కట్‌.. బీఆర్‌ఎస్‌ శ్రేణుల సందడి

కల్లూరు, ఆగస్టు 15 (విజయక్రాంతి): సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే,బీఆర్‌ఎస్‌ నాయకుడు సండ్ర వెంకటవీరయ్య జన్మదిన వేడుకలను కల్లూరు మండల బీఆర్‌ఎస్‌ శ్రేణులు శనివారం ఘనంగా నిర్వహించాయి.కార్యకర్తలు, అభిమానుల సమక్షంలో భారీ కేక్‌ కట్‌ చేసి బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు.

2029లో కేసీఆర్‌దే అధికారం

ఈ సందర్భంగా మాజీ జడ్పీటీసీలు డాక్టర్‌ లక్కినేని రఘు,కట్టా అజయ్‌కుమార్‌ మాట్లాడుతూ.. 2029లో కేసీఆర్‌ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.కాంగ్రెస్‌ పాలనలో అభివృద్ధి కుంటుపడిందని తీవ్రంగా విమర్శించారు.

రోగులకు పండ్లు.. బాటసారులకు పులిహోర

జన్మదిన వేడుకలను పురస్కరించుకుని కల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు పండ్లు పంపిణీ చేశారు. బాటసారులకు పులిహోర అందించారు.దీంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం వెల్లివిరిసింది.కార్యక్రమంలో మండల బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు పాలెపు రామారావు,కౌన్సిలర్లు పెడకంటి రామకృష్ణ,కనపర్తి శ్యామల రాజ్‌కుమార్‌, ఇస్మాయిల్‌,బిఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి కొరకప్పు ప్రసాద్,సర్పంచ్‌ పోట్రు శ్రీనివాసరావు,జినుగు శ్రీనివాసరావు,సొసైటీ చైర్మన్లు నర్వనేని పెద్ద అంజయ్య,బోబోలు లక్ష్మణరావు,నాయకులు, కార్యకర్తలు,అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.