15 August, 2026 | 5:31 PM

గుండు ఆరవింద్ నీచపు రాజకీయాలు మానుకోవాలి: బీర్ల అయిలయ్య

15-08-2026 05:04 PM

ఆలేరు, ఆగస్ట్ 15 (విజయక్రాంతి): జనగామ జిల్లా కేంద్రంలోని డీసీసీ కార్యాలయంలో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ ఎంపీ గుండు ఆరవింద్(MP Aravind) చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్రంగా స్పందించారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌పై వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదన్నారు. రాజకీయాల్లో వ్యక్తిగత దూషణలు కాకుండా ప్రజా సమస్యలు, విధానాలపై మాట్లాడాలని సూచించారు. మహేష్ కుమార్ గౌడ్‌పై చేసిన వ్యాఖ్యలకు గుండు ఆరవింద్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అధికారం, పదవులు శాశ్వతం కాదని, ప్రజలే అంతిమ నిర్ణేతలని బీర్ల అయిలయ్య అన్నారు.