17 June, 2026 | 4:01 AM

యూరియా కోసం చెప్పుల క్యూ

17-06-2026 12:24 AM

గాంధారి మండలం నేరల్‌తండాలో ఘటన 

గాంధారి, జూన్ 16 (విజయక్రాంతి ): కామారెడ్డి జిల్లా గాంధారి మండలం నేరల్‌తండాలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం గోదాం వద్ద యూరియా కోసం c చెప్పులను క్యూలో పెట్టి ఎదురుచూశారు. ఈ విషయమై సొసైటీ కార్యదర్శి గాండ్ల సాయిలును విజయక్రాంతి సంప్రదించగా 888 బస్తాల యూరియా వచ్చిందన్నారు.  యాప్‌లో బుక్ చేసుకున్న రైతులకు దాని ప్రకారం యూరియా అందచేస్తామన్నారు. రైతులు ఒకేసారి వచ్చి అవగాహన లేక తమకు యూరియా దొరుకుతుందో లేదో అని అలా చెప్పులు క్యూలో పెట్టారని అన్నారు.