ఇసుక రీచ్ తనిఖీ
హాజీపూర్, జూన్ 19 : హాజీపూర్ మండలంలోని ముల్కల్లలో గల ఇసుక రీచ్ ను శు క్రవారం కలెక్టర్ కుమార్ దీపక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇసుక తరలింపు ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మన ఇసుక వాహనం యాప్ ద్వారా ఇసుకను బుక్ చేసుకున్న లబ్ధిదారులకు మాత్రమే ఇసుక తరలించాలని, నిబం ధనలు ఉల్లంఘించినట్లైతే సంబంధిత వ్యక్తులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఓటి పి లేని ట్రాక్టర్ బయటకు వెళ్లకూడదని అధికారులను ఆదేశించారు. అనంతరం హాజీ పూర్ మండల కేంద్రంలోని కేజీబీవిని సందర్శించి అదనపు గదులు, భోజనశాల పనుల ను పరిశీలించి పలు సూచనలు చేశారు.
వం టశాలలో విద్యార్థులకు ఆహారం తయారీ సమయంలో శుభ్రత నిబంధనలు పాటించాలని, నిత్యవసర సరుకులను క్రమ పద్ధతిలో నిల్వ చేసుకోవాలన్నారు. మండల తహసిల్దార్ కార్యాలయాన్ని సందర్శించి తహసిల్దా ర్ పుష్పలతతో కలిసి కార్యాలయం రికార్డు లు, రిజిస్టర్లు తనిఖీ చేశారు. అధికారులు, సి బ్బంది విధుల పట్ల సమయపాలన పాటించాలని, ప్రజలకు జవాబుదారీగా వ్యవహ రించాలన్నారు. భూ భారతి రెవెన్యూ సదస్సులలో అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయి లో పర్యవేక్షించి రికార్డులతో సరిచూసి త్వర గా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. మండల వ్యవసాయ అధికారి కృష్ణతో మాట్లాడుతూ రైతులకు పంట మా ర్పిడి, భూసారం పెంపుదల, పంట సాగులో అవలంబించవలసిన మెలకువలపై అవగాహన కల్పించాలని సూచించారు. మండల కేంద్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల ను సందర్శించి సూచనలు చేశారు. ఆయన వెంట ఆయా శాఖల అధికారులు ఉన్నారు.






