సిరిసిల్లలో రెచ్చిపోయిన ఇసుక మాఫియా
- దుమ్ము రాకుండా నీరు పట్టాలన్న తహసీల్దార్‌పై హత్యాయత్నం
- కారుపైకి దూసుకొచ్చినట్రాక్టర్
- తృటిలో తప్పిన ప్రమాదం.. డ్రైవర్, యజమానిపై కేసు
కరీంనగర్, ఏప్రిల్16 (విజయక్రాంతి): సిరిసిల్లలో ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. ఎం తటి అఘాయిత్యానికైనా ఒడికట్టడానికి బరితెగిస్తోంది. రోజురో జుకూ వారి ఆగడాలు మితిమీరుతున్నాయి. అక్రమ ఇసుక రవా ణాకు అడ్డుపడే అధికారులను సైతం చంపేందుకు వెనకాడటం లేదు. దుమ్ము లేయకుండా నీరు పట్టించాలన్న తహసీల్దార్‌పై ఏకంగా ఇసుక లోడ్ ట్రాక్టర్‌తో హత్యాయత్నానికి పాల్పడడం జిల్లాలో కలకలం సృష్టిస్తోంది.
తృటిలో పెనుప్రమాదం నుంచి తహసీల్దార్ మహేష్ తప్పించుకోగా, ఈ ఘటనపై సిరిసిల్ల పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదయింది. ఇసుక రవాణా జరుగుతున్న తీరును పరిశీలించేందుకు సిరిసిల్ల తహసీల్దార్ మహేష్ పట్టణంలోని సాయినగర్ మానేరు తీరంలోకి గురువారం వెళ్లారు. దీంతో ఆప్రాంత కాలనీవాసులు ఇసుక ట్రాక్టర్‌లతో విపరీతంగా దుమ్ములేస్తుందని తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన ఆయన దుమ్ములేవకుండా నీరు పట్టించాలని ఆదేశించారు.
అనంతరం కార్యాలయానికి తిరుగి వెళ్లుతున్న క్రమంలో తహసీల్దార్‌పై ఇసుక లోడ్ ట్రాక్టర్‌తో దాడికి యాత్నించారు. అనుమతులు లేకుండా ఇసుక స్మగ్లింగ్ చేస్తున్న ట్రాక్టర్ అతివేగంగా రాంగ్ రూట్లో ఆయన కారు పైకి దూసుకొచ్చింది. కారు డ్రైవర్ చాకచక్యంగా కారును పక్కకు తప్పించడంతో తహసీల్దార్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. ఇసుక స్మగ్లింగ్ చేస్తున్న ట్రాక్టర్‌పై పోలీసులకు తహసీల్దార్ ఫిర్యాదు చేశారు. దీంతో ట్రాక్టర్ డ్రైవర్ శివాజీతోపాటు యజమానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకుని, కేసు దర్యాప్తు చేస్తున్నారు.






