ఎమ్మెల్యే చిత్రపటానికి పాలాభిషేకం
పాపన్నపేట, జూన్ 30: రాష్ట్రంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గమ్మ ఆలయ పర్యాటకాభివృద్ధి కొరకు ఏకో ఫ్రెండ్లీ 12 కాటేజీల నిర్మాణానికి రూ.7 కోట్లు మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు చొరవతో టూరిజం శాఖ టిజి టిడిసి ద్వారా సోమవారం మంజూరు చేసిన విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా మంగళవారం పాపన్నపేట మండల సర్పంచులు, కాంగ్రెస్ నాయకులు, మాజీ సర్పంచులు, కార్యకర్తలు ఏడుపాయల వనదుర్గా భవాని మాత ఆలయం వద్ద మెదక్ శాసనసభ్యులు మైనంపల్లి రోహిత్ రావు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ ప్రాంత అభివృద్ధి కొరకు కృషి చేసిన ఎమ్మెల్యేకు వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నరేందర్ గౌడ్, నాయకులు కిసాన్ ప్రభాకర్ రెడ్డి, శ్రీకాంత్, గోవింద్ నాయక్, రాజశేఖర్, చోటు, వివిధ గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచ్ లు తదితరులు పాల్గొన్నారు.






