1 July, 2026 | 2:12 AM

హిందీ పండిత్ తీగల సత్యనారాయణకు ఘన వీడ్కోలు

01-07-2026 01:14 AM

వేములవాడ, జూన్ 30 (విజయక్రాంతి): వేములవాడ మున్సిపల్ పరిధిలోని శాత్రాజుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హిందీ పండిత్గా సుదీర్ఘకాలం సేవలందించిన తీగల సత్యనారాయణ ఉద్యోగ విరమణ సందర్భంగా మంగళవారం ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, విద్యార్థులు, మిత్రులు ఆయన క్రమశిక్షణ, అంకితభావంతో చేసిన సేవలను కొనియాడారు. అనంతరం శాలువాతో సత్కరించి జ్ఞాపిక అందజేశారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్, కౌన్సిలర్లు ఏనుగు జ్యోతి, ఎలా శ్రీనివాస్, మైలారం శ్రీనివాస్, బాల్యమిత్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.