ప్రజల దాహార్తిని తీర్చడానికి చలివేంద్రాలు ఏర్పాటు
బీజేపీ మాజీ ఎంపీటీసీ మాలోత్ అంకిత రవి నాయక్
మేడ్చల్ అర్బన్ ఏప్రిల్ 16(విజయక్రాంతి): ప్రజల దాహార్తిని తీర్చడానికి ఎల్లంపేట్ మున్సిపల్ పట్టణ పరిధిలోని సోమారం, రాజ బొల్లారం తాండ లలో చలివేంద్రాలను ప్రారంభించినట్లు రాజబొల్లారం తాండ మాజీ బిజెపి ఎంపీటీసీ మాలోత్ అంకిత రవి నాయక్ తెలిపారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రయాణికులు ప్రజల దహారతి తీర్చడానికి ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని ఆమె చెప్పారు.మేడ్చల్ మున్సిపల్ పట్టణ సమీపంలోని శ్రీ శ్రీ క్షేత్ర గిరి వెంకటేశ్వర స్వామి కమాన్ వద్ద ప్రయోజనంగా ప్రజలకు దాహార్తి తీర్చడానికి చలి వేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని మాజీ ఎంపిటిసి అంకిత రవి నాయక్ చెప్పారు.
అనంతరం ఎల్లంపేట్ మున్సిపల్ పట్టణ పరిధిలోని సోమారం కమాన్ వద్ద ప్రజల దహార్తిని తీర్చడానికి చలి వేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని స్థానిక మున్సిపల్ కౌన్సిలర్ రజిత రాజేందర్ తెలిపారు.ఈ కార్యక్రమంలో మాలోత్ సంతోష్ నాయక్.పాండు నాయక్.కే కుమార్ నాయక్.ఎం రాజు.నాయక్ టిఎం రవి నాయక్.బాబురావు.సోమారం మాజీ సర్పంచ్ ఆర్ కరుణాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.






