ఆయుధం వీడిన సాంబయ్య
- మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు ముప్పిడి సాంబయ్యతో సహా 15మంది లొంగుబాటు
- పోలీసులకు 14 ఆయుధాలు అప్పగింత
- అభివృద్ధి, పునరావాస విధానం ఫలితంగా లొంగుబాటు సాధ్యం
- ఛత్తీస్‌గఢ్ హోం మంత్రి విజయ్ శర్మ
మహబూబాబాద్, మార్చి 1 (విజయక్రాంతి): మావోయిస్టు పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. ఛత్తీస్‌ఢ్ రాష్ట్రంలోని మహాసముంద్ జిల్లాలో శనివారం 15మంది మావోయిస్టులు ఆయుధం వీడి పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరిలో తొమ్మిది మంది మహిళలు, ఆరుగురు పురుషులు ఉండగా వరంగల్ జిల్లాకు చెందిన ముప్పిడి సాంబయ్య అలియాస్ వికాస్ ఉన్నారు. వీరు ఒడిశా ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో కార్యకలాపాలు నిర్వహిస్తున్న బలంగీర్ -బర్గఢ్- మహాసముంద్ (బీబీఎం) విభాగానికి చెందిన వారని చత్తీస్‌గఢ్ పోలీసులు తెలిపారు.
ఛత్తీస్‌గఢ్ హోం మంత్రి విజయ్ శర్మ తన ఎక్స్ ఖాతాలో ఫొటోను పంచుకుంటూ, తుపాకులను వదిలి రాజ్యాంగాన్ని, ‘త్రివర్ణ పతాకాన్ని’ ఎత్తుకున్నారన్నారు. స్టేట్ కమిటీ సభ్యుడిగా పనిచేసిన వికాస్ అలియాస్ సాంబయ్యతో పాటు, సుమారు రూ.73 లక్షల రివార్డు ప్రకటించబడిన 15 మంది మావోయిస్టులు 14 ఆయుధాలను అప్పగించి అభివృద్ధి మార్గాన్ని ఎంచుకున్నారని ఆయన పేర్కొన్నారు.
అలాగే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కేంద్ర హోం మంత్రి అమిత్ షా మార్గదర్శకత్వంలో రాష్ట్రంలోని విష్ణుదేవ్ ప్రభుత్వ పునరావాస విధానం, మంచి పాలనపై నమ్మకం కల్పించే చర్యల వల్ల తప్పుదారి పట్టిన యువత ప్రధాన ప్రవాహంలోకి వస్తున్నారని తెలిపారు.
ఆయుధాల్లో 3ఏకే 47 రైఫిళ్లు
లొంగిపోయిన మావోయిస్టులు పోలీసులకు 14 అధునాతన ఆయుధాలను అప్ప గించారు. అందులో 3 ఏకే 47 రైఫిళ్లు, 2 ఎస్‌ఎల్‌ఆర్లు (సెల్ఫ్ లోడింగ్ రైఫిళ్లు), 2 ఇన్సాస్ రైఫిళ్లు ఉన్నాయి. ఈ పరిణామాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి విజయ్ శర్మ ధృవీకరిస్తూ హింసను త్యజిం చి ఈ 15 మంది సాధారణ జీవన ప్రవాహంలోకి చేరారు. భద్రతా దళాల నిరంతర ఒత్తిడి, దూర ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు, పునరావాస విధానం ఫలితంగా ఈ లొంగుబాటు సాధ్యమైందన్నారు.
లొంగిపోయిన వారికి పూర్తి భద్రత, వైద్య సదు పా యాలు, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. భద్రతా దళాల కఠిన చర్య లు, రోడ్ల నిర్మాణం, పాఠశాలలు, ఆరోగ్య స దుపాయాలు, ఉపాధి పథకాలు వంటి అభివృద్ధి కార్యక్రమాలు మావోయిస్టు ప్ర భావి త ప్రాంతాల్లో వేగవంతమవడం ఈ మార్పు కు కారణమని అధికారులు పేర్కొన్నారు.




