15 May, 2026 | 1:04 AM

భావోద్వేగాల హ్యాపీ జర్నీ

15-05-2026 12:00 AM

గుత్తా ప్రొడక్షన్స్, కమలాకర్ ఫిల్మ్ కార్పొరేషన్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘హ్యాపీ జర్నీ’. అభిరామ్ నాయుడు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం మహిళా భావోద్వేగాలకు ప్రధాన ప్రాధాన్యతనిస్తూ రూపొందుతోంది. బాలాజీ గుట్ట, కౌశిక్ రెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఏడుగురు మహిళల భావోద్వేగ ప్రయాణాలను ప్రధానంగా చూపించే ప్రయత్నం ఈ చిత్రం చేస్తోంది.

అన్నపూర్ణమ్మ, ఆమని, యాంకర్ ఝాన్సీ, పాయల్ రాధాకృష్ణ, జినిషా అలీశెట్టి, రూపా శ్రీనివాస్, సునయన ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా, పృథ్వీ దండమూడి, వంశీధర్ గౌడ్, రవి శివతేజ పైలా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. త్వరలోనే థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతున్న ఈ మూవీ ఫస్ట్ లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ పోస్టర్ ఎంతో ఫీల్‌గుడ్ ట్రావెల్ వైబ్‌ను అందిస్తోంది. ‘హ్యాపీ జర్నీ’ కేవలం ట్రావెల్ కథ కాదు మహిళల భావాలు, అనుబంధాలు, జీవిత మార్పులు, ఆత్మీయతలపై సాగే హృద్యమైన ప్రయాణం. ఈ చిత్రానికి శేఖర్ చంద్ర సంగీతం అందిస్తుండగా, మణికందన్ సుబ్రమణియన్ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. ఛోటా కే ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టగా, బ్రహ్మ కడలి ప్రొడక్షన్ డిజైన్ అందిస్తున్నారు.