11 May, 2026 | 4:04 PM

సామల సదాశివ జయంతి వేడుకలు

11-05-2026 02:12 PM

కాగజ్‌నగర్(విజయక్రాంతి): కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, బహుభాషా కోవిదుడు డాక్టర్ సామల సదాశివ జయంతిని కాగజ్‌నగర్‌లో వివిధ సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. బస్‌స్టాండ్ సమీపంలోని ఆయన విగ్రహానికి తెలుగు సాహితీ సదస్సు సభ్యులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వక్తలు సామల సదాశివ తెలుగు, ఉర్దూ, పార్శీ, మరాఠీ భాషల్లో విశేష సేవలు అందించారని కొనియాడారు.ఈ కార్యక్రమంలో పెండ్యాల కిషన్ శర్మ, కటకం మధూకర్, వాసాల ప్రభాకర్, జైడి దేవాజీ, శాంత కుమారి, కేదారి, మోతీరాం తదితరులు పాల్గొన్నారు. 

పద్మశాలి సంఘం ఆధ్వర్యాలో పట్టణ పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో ఎల్లాగౌడ్ తోటలోని పద్మశాలి కమ్యూనిటీ హాల్‌లో జయంతి వేడుకలు నిర్వహించారు. అధ్యక్షులు గుల్లపల్లి నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి వడ్నాల వెంకన్న మాట్లాడుతూ సదాశివ మాస్టారు తెలుగు సాహిత్యానికి చేసిన సేవలను స్మరించుకున్నారు. కార్యక్రమంలో సిందం చంద్రయ్య, రాపల్లి సదానందం, నూతి సుదర్శన్, దోమల సురవర్ధన్, సుంక లింగమూర్తి, కొక్కుల మురళి, భోగ వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.