కడుపుబ్బా నవ్వించే వాలా II
21-04-2026 02:35 AM
హషీర్ హెచ్, అలన్ బిన్ సిరాజ్, అజిన్ జాయ్, వినాయక్ వీ ప్రధాన పాత్రల్లో నటించిన మలయాళ చిత్రం ‘వాలాII ’. సావిన్ ఎస్‌ఏ దర్శకత్వం వహించారు. సాహు గారపాటి తన షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై విపిన్ దాస్, హారిస్ దేశం, పీబీ అనిష్, ఆదర్శ్ నారాయణ్, ఐకాన్ స్టూడియోస్‌తో కలిసి నిర్మించిన ఈ చిత్రం మలయాళంలో ఇప్పటికే 200 కోట్ల స్థూల వసూళ్లతో భారీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇక ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు వెర్షన్ ఈ నెల 24న థియేటర్లలో విడుదల కానుంది. ఈ క్రమంలో హీరో నాని ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ట్రైలర్ కామెడీ, భావోద్వేగ క్షణాలు కలగలిపిన కథతోపాటు, నాస్టాల్జియా మూమెంట్స్‌తో కట్టిపడేసింది.






