21 April, 2026 | 4:09 AM

పూర్తిస్థాయి వినోదాత్మకంగా పురుషః

21-04-2026 02:33 AM

కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బత్తుల కోటేశ్వరరావు నిర్మించిన చిత్రం ‘పురుషః’. పవన్‌కళ్యాణ్ బత్తుల తెరకు పరిచయం కాబోతున్న ఈ సినిమాకు వీరు వులవల దర్శకుడు. ఈ చిత్రంలో సప్తగిరి, కసిరెడ్డి రాజ్‌కుమార్, రాయంచ కొక్కుర, విషిక, హాసిని సుధీర్, అనంత్ శ్రీరామ్, వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అవుట్ అండ్ అవుట్ కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ప్రస్తుతం చివరి దశలో ఉన్నాయి. మే నెలలో విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: శ్రవణ్ భరద్వాజ్; డీవోపీ: సతీశ్ ముత్యాల; ఎడిటర్: కోటి.