calender_icon.png 18 February, 2026 | 1:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కరీంనగర్ గడ్డపై కాషాయ జెండా

17-02-2026 01:10:15 AM

  1. ఈ విజయం ప్రజల ఆత్మగౌరవానికి నిదర్శనం
  2. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

హైదరాబాద్, ఫిబ్రవరి 16 (విజయక్రాంతి): కరీంనగర్ గడ్డపై కాషాయ జెండా ఎగిరిందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికార గర్వంతో ఎన్ని కుట్రలు పన్నినా, అక్రమాలకు పాల్పడినా.. ప్రజాస్వామ్య స్ఫూర్తిని అణచివేయలేరని కరీంనగర్ ప్రజలు చాటిచెప్పారని స్పష్టం చేశారు. కరీంనగర్ కార్పొరేషన్ మేయర్‌గా ఎన్నికైన కోలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్‌గా ఎన్నికైన సునీల్ రావుకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా సోమవారం ట్వీట్ చేశారు. ఈ విజయం కేవలం ఒక పదవికి సంబంధించింది కాదని, ఇది కరీంనగర్ ప్రజల ఆత్మగౌరవానికి నిదర్శనమన్నారు. అభివృద్ధికి, నిజాయితీకి పట్టం కట్టిన నైతిక విజయమని వెల్లడించారు.

కరీంనగర్ గడ్డపై ఎగిరిన ఈ కాషాయ జెండా, తెలంగాణలో రాబోయే బీజేపీ సర్కారుకు బలమైన నాందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను, వారి ద్వంద్వ ప్రమాణాలను ఎండగడుతూ.. ప్రజల పక్షాన నిలబడే సత్తా ఒక్క బీజేపీకే ఉందని ఈ ఫలితం నిరూపించిందన్నారు. కోలగాని శ్రీనివాస్, సునీల్‌రావు నాయకత్వంలో కరీంనగర్ నగరం అభివృద్ధిలో దూసుకెళ్లాలని, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలని కిషన్‌రెడ్డి ఆకాంక్షించారు.