calender_icon.png 13 February, 2026 | 3:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘రైతు భరోసా’ వెంటనే విడుదల చేయాలి

13-02-2026 12:23:35 AM

తుంగతుర్తి, ఫిబ్రవరి 12: రైతు భరోసా డబ్బులు కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని మాజీ ఎంపీపీ, బీ ఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షులు తాటికొండ సీతయ్య అన్నారు. గురువారం మండల కేంద్రంలో రైతు భరోసా లు వెంటనే విడుదల చేయాలని కోరుతూ ధర్నా చేపట్టారు. ఈ సందర్భముగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అనేక అబద్దపు వాగ్దానాలు చేసి అధికారానికి వచ్చి రెండున్నర ఏండ్లు అవుతున్న ఏఒక్క వాగ్దానాన్ని కూడా అమలు చేయడం లేదన్నారు.

కెసిఆర్ పాలనలో వరి నాట్ల ముందు రైతు బంధు డబ్బులు వేస్తె రేవంత్ పాలనలో ఓట్ల ముందు వేసే పరిస్థితి నుంచి ఎగగొట్టే పరిస్థితి దాపురించిందన్నారు. గత బకాయి ల తో పాటు ఈ యాసంగి పంటకు ఇవ్వాల్సిన రైతు భరోసా డబ్బులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ దొంగరి శ్రీనివాస్. సర్పంచ్ లు. తప్పేట్ల యెల్లయ్య. మాతంగి వెంకటమ్మ కరుణాకర్. మండల నాయకులు. మల్యాలా రాములు. గుడిపాటి వీరయ్య. కడారి దాసు. మట్టిపెల్లి వెంకట్. గోపగాని రమేష్.. యాకూబ్. గ్రామ శాఖ అధ్యక్షులు గోపగాని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.