calender_icon.png 13 February, 2026 | 4:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్నికల కోడ్ ఉల్లంఘన

13-02-2026 12:24:41 AM

  1. ముగ్గురు నేతలపై కేసులు

కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, ఎంపీ అర్వింద్, ఎమ్మెల్యే గంగులపై కేసు

నిజామాబాద్/సంగారెడ్డి/కరీంనగర్ క్రైం, ఫిబ్రవరి 12(విజయక్రాంతి): రాష్ట్రంలో బుధవారం జరిగిన మున్సిపల్ ఎన్నికల వేళ నిబంధనలు ఉల్లంఘించారని ముగ్గురు నేతలపై గురువారం కేసులు నమోదయ్యాయి. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డిపై సంగారెడ్డిలో కేసు నమోదు చేశారు. బుధవారం పట్టణంలోని 34వ వార్డులో కాంగ్రెస్ అభ్య ర్థి అడ్డూపై సీఐ శివకుమార్ దాడికి పాల్పడి, కాలర్ పట్టుకొని అవమానించాడని జగ్గారెడ్డి పోలింగ్ బూత్‌కు వెళ్లి తీవ్రస్థాయిలో ఆగ్ర హం వ్యక్తం చేశారు. సీఐపై బూతులు తిడు తూ పోలింగ్ ఆపివేస్తామని హెచ్చరికలు జారీ చేశారు.

ఈసీ ఎన్నికల విధులకు ఆటం కం కలిగించినందుకు జగ్గారెడ్డిపై కేసు నమో దు చేయాలని జిల్లా ఎస్పీకి ఆదేశాలు జారీ చేయడంతో గురువారం ఎస్పీ ఆదేశాల మేరకు జగ్గారెడ్డిపై  కేసు నమోదు చేశారు. నిజామాబాద్ ఎంపీ అర్వింద్‌పై నిజామాబాద్ వన్ టౌన్ ఠాణాలో కేసు నమోదు అ యింది. ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు, పోలీసు సిబ్బందిని బెదిరించాడని, హరిచరణ్ మార్వాడి స్కూల్‌లో బందోబస్తు నిర్వ హిస్తున్న వారిపై దూషణకు దిగడంతో ఈ కేసు నమోదయింది. కరీంనగర్ కిసాన్ నగ ర్ పరిధిలో పోలీసులు మూడు వేర్వేరు కేసు లు నమోదు చేశారు.

కిసాన్ నగర్‌లో ఓటర్లను డబ్బులు పంపిణీ చేస్తున్న అంబేద్కర్ నగర్‌కు చెందిన కుర్ర తిరుపతి వద్ద రూ.44,500 నగదు పట్టుకున్నారు. అతడిపై కేసు నమోదు చేశారు. కిసాన్ నగర్‌కు చెందిన లొకిని జంపయ్య నుంచి రూ.47 వేలు స్వాధీనం చేసుకుని, అతడ్ని అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలిస్తుండగా.. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అడ్డుకుని, ధర్నా చేశారు. దీంతో గంగులతోపాటు మరో ఆరుగురిపై కుర్ర తిరుపతి, ఎడ్ల అశోక్, అమరగొండ అశోక్, ఎడ్ల సరిత, పెరుక మంజుల, బేజుగం మధులపై కేసు నమోదు  చేశారు.