calender_icon.png 13 February, 2026 | 1:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈ నెల16న ‘బడ్జెట్ నాలెడ్జ్ టెస్ట్’

13-02-2026 12:22:32 AM

  1. ఐఐఎంసీ కళాశాల ఆధ్వర్యంలో ఆన్‌లైన్‌లో నిర్వహణ

పరీక్షకు సంబంధించి వాల్‌పోస్టర్ ఆవిష్కరించిన ప్రిన్సిపాల్

ఖైరతాబాద్, ఫిబ్రవరి 12(విజయక్రాంతి): ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ కామర్స్ కళాశాల (స్వయంప్రతిపత్తి), ప్లానెట్ ఫైనాన్స్ బిజినెస్ స్కూల్ సంయుక్తంగా ఈ నెల16న బడ్జెట్ నాలెడ్జ్ టెస్ట్‌ను ఆన్‌లైన్ ద్వారా నిర్వహిస్తున్నాయి. డిగ్రీ, పీజీ విద్యార్థుల్లో కేంద్ర బడ్జెట్ 2026 అంశాలపై అవగాహన కలిగించాలనే ఉద్దేశంతో ‘బడ్జెట్ నాలెడ్జ్ టెస్ట్‘ను నిర్వహించనున్నారు.ఇందులో వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కళాశాల ప్రిన్సిపల్ కూర రఘువీర్ బడ్జెట్ నాలెడ్జ్ టెస్ట్ కు సంబంధించిన వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరీక్షలో కేంద్ర బడ్జెట్ కు సంబంధించిన అంశాలపై100 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఉంటాయన్నారు. ఎలాంటి రిజిస్ట్రేషన్ ప్రక్రియ, ఫీజు లేదని, పరీక్షలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి నగదు బహుమతులు ఉంటాయని పేర్కొన్నారు. ఈ పరీక్షకు సంబంధించిన గూగుల్ అంతర్జాల లింకు మా కళాశాల వెబ్‌సైట్ www.iimchyd.ac.in లో 16వ తేదీన మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు అందుబాటులో ఉంటుంది.

విద్యార్థులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పరీక్షలో పాల్గొని బహుమతులు గెలుపొందవలసిందిగా ప్రిన్సిపాల్ విజ్ఞప్తి చేశారు. బడ్జెట్ నాలెడ్జ్ టెస్ట్ కు సంబంధించిన మరిన్ని వివరాల కోసం 9573027171, 9440147113, 9346978530, 9493976082 ఫోన్ నంబర్లను సంప్రదించాలని, బడ్జెట్ నాలెడ్జ్ టెస్ట్ బ్రోచర్ కోసం కళాశాల వెబ్‌సైట్ చూడాల్సిందిగా ప్రిన్సిపాల్ సూచించారు.