5 July, 2026 | 2:18 AM

బెంగళూరు ప్రయాణికులకు ఆర్టీసీ గుడ్‌న్యూస్

05-07-2026 12:39 AM

శంషాబాద్ బోర్డింగ్ పాయింట్ వరకు ఉచిత ప్రయాణం

హైదరాబాద్, జూలై 4 (విజయక్రాంతి): హైదరాబాద్ మార్గంలో ప్రయాణించే ప్రయాణికులకు ఆర్టీసీ తీపికబురు చెప్పింది. శంషాబాద్ బోర్డింగ్ పాయింట్‌ను ఎంపిక చేసుకుని సాయంత్రం 6 గంటల తర్వాత బయలుదేరే హైదరాబాద్ బస్సు సర్వీసులకు రిజర్వేషన్ టికెట్ బుక్‌చేసుకున్న ప్రయాణికులకు శంషాబాద్ వరకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్లు సంస్థ ఎండీ వై నాగిరెడ్డి తెలిపారు. ఆ తరువాత తమకు రిజర్వేషన్ ఉన్న బెంగుళూరు సర్వీసుల్లో ఎక్కి ప్రయాణాన్ని కొనసాగించాలని పేర్కొన్నారు.