5 July, 2026 | 3:48 AM

ఐదు జిల్లాల్లో అప్రెంటిస్‌షిప్ జాబ్ మేళా

05-07-2026 12:41 AM

ఇంటర్ బోర్డు కార్యదర్శి అభిలాష అభినవ్

హైదరాబాద్, జూలై 4 (విజయక్రాంతి): తెలంగాణలోని ఇంటర్మీడియట్ వృత్తి విద్య పూర్తి చేసిన విద్యార్థులకు శుభవార్త. తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యాశాఖ, రీజినల్ డైరెక్టరేట్ ఆఫ్ స్కిల్ డెవలప్‌మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సంయుక్తంగా అప్రెంటి న్‌షిప్ కమ్- జాబ్ మేళా 2026ను నిర్వహించనున్నారు. ఈ మేరకు శనివారం ఇంటర్ బోర్డు ఒక ప్రకటనను విడుదల చేసింది. ఈ నెల 6 నుంచి 14 వరకు రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లో జాబ్‌మేళా నిర్వహించనున్నారు.

అప్రెంటిస్‌షిప్ శిక్షణ పొందే వారికి నెలకు రూ.9,600 స్టైపెండ్ అందించనున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి అభిలాష అభినవ్ తెలిపారు. ఈ ఏడాది ఇంటర్‌లో ఉత్తీర్ణులైన ఫ్రెషర్లు, గత మూడు విద్యా సంవత్సరాల్లో ఇంటర్ వృత్తి విద్య పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు.

అభ్యర్థులు సంబంధిత సర్టిఫికెట్‌లతో జూలై 6న ఎస్కేపీఎం ప్రభుత్వ వొకేషనల్ జూనియర్ కళాశాల, కుత్బుల్లాపూర్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, జూలై 7న కస్తూర్బా గాంధీ జూనియర్ కళాశాల, మారేడ్‌పల్ల్లి, సికింద్రాబాద్, జూలై 13న వ్రొకేషనల్ జూనియర్, హనుమకొండ, జూలై 14న వొకేషనల్ జూనియర్ కళాశాలలు, మహబూబ్‌నగర్, నల్లగొండలో హాజరు కావాన్నారు.