24 August, 2026 | 4:28 AM

క్యామ మల్లేష్‌కు ఆర్‌ఎస్‌పీ పరామర్శ

24-08-2026 01:03 AM

అబ్దుల్లాపూర్‌మెట్, ఆగస్టు 23: ఇటివల కాలంలో అనారోగ్యానికి గురై ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న భువనగిరి బీఆర్‌ఎస్ పార్టీ ఇన్‌చార్జి క్యామ మల్లేష్‌ను ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ వారి నివాసంలో కలసి పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి, యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకుని  మళ్లీ ప్రజాక్షేత్రంలో చురుగ్గా పాల్గొనాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో బీఆర్‌ఆర్ పౌండేషన్ చైర్మన్ బూడిద రాంరెడ్డి, బండరావిరాల సర్పంచ్ కందికంటి విజయ్‌కుమార్, ఎంసీ కేశవరావు, ఆందోజు శంకరాచారి, కొమ్ము శ్రీనివాస్, అంజన్ కుమార్ , మహేష్ చారి, ఎం. వెంకట్, బండరావిరాల ఉప సర్పంచ్ దూస శంకర్, వార్డు సభ్యులు కన్నె భారత్ , ఎడవెల్లి సుష్మిత- రమేష్ , గుండ్ల భవానీ శివ, నాయకులు గుండ్ల సతీష్, కే మధు, ఒంగూరి రమేశ్, ఏర్పుల నరేందర్ , కే అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.