10 April, 2026 | 3:43 AM

రూ.1.40 కోట్ల కుంభకోణం

10-04-2026 01:46 AM
  1. మరణించిన సిబ్బంది పేర్లతో జీతాలు డ్రా

టాస్క్‌ఫోర్స్ విచారణలో గుట్టురట్టు.. పోలీసు ఉద్యోగిపై కేసు నమోదు

కరీంనగర్ పోలీస్ కమిషనరేట్‌లో ఘటన

కరీంనగర్, ఏప్రిల్ 9(విజయక్రాంతి): కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో మరణించిన సిబ్బంది పేర్లతో జీతాలు డ్రా చేస్తూ స్వాహా చేస్తున్న ఉదంతం వెలుగులోకి వచ్చింది. సుమారు 1,40,18,308 రూపాయ లు దుర్వినియోగమైనట్లు టాస్క్‌ఫోర్స్ ఏసీపీ విచారణలో తేలింది. గతంలో పే-సెక్షన్‌లో పనిచేసిన ఒక పోలీసు ఉద్యోగి మరణించిన ము గ్గురు కానిస్టేబుళ్ల ఎంప్లాయీ ఐడీలను ఉపయోగించి, పోర్టల్లో ఇతరుల పేర్లను చేర్చారు.

నిందితుడు ప్రైవేట్ బ్యాంకుల్లో నకిలీ ఖాతాలు తెరిచి, తన వ్యక్తిగత మొబైల్ నంబర్లను అనుసంధానించడం ద్వారా 2022 నుంచి 2026 వరకు జీతాల సొమ్మును తీసుకొని సొంతానికి వాడుకున్నాడు. అలాగే లోన్లు పొందడమే కాకుండా, నగదును వ్యక్తిగత అవసరాలకు వాడుకున్నట్లు గుర్తించారు.

ఈ ఘటనపై కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం ఆదేశాల మేరకు బాధ్యుడైన పోలీసుఉద్యోగిపై కరీంనగర్ I-టౌన్ పోలీస్ స్టేషన్‌లో క్రిమినల్ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని కరీంనగర్ వన్ టౌన్ ఇన్‌స్పెక్టర్ రాంచందర్ రావు తెలిపారు.ఇంకా ఎవరెవరికి ఈ ఘటనతో సంబం ధాలు ఉన్నాయని అంతర్గత విచారణ జరుపుతున్నామని, పూర్తి విచారణ జరిపి బాధ్యులైన వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ తెలిపారు.