22 April, 2026 | 6:52 PM

సమాజంలో ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైనది

22-04-2026 05:25 PM

40 ఏళ్లుగా ఉపాధ్యాయ వృత్తిలో రాణించి పదవి విరమణ పొందిన రౌతు శ్రీదేవి

తుంగతుర్తి,(విజయక్రాంతి): సమాజంలో ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైనదని ఎంఈఓ బోయిని లింగయ్య, పీఆర్టీయు జిల్లా అధ్యక్షుడు జితేందర్ రెడ్డిలు అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని రిటైర్డ్ ఉద్యోగుల సంఘం భవనంలో పోతరాజు చంద్రశేఖర్ అధ్యక్షతన జరిగిన ఎస్సీ కాలనీలో ఎంపీపీఎస్ పాఠశాల ఉపాధ్యాయురాలు రౌతు శ్రీదేవి పదవి విరమణ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.

40 ఏళ్లుగా ఉపాధ్యాయ వృత్తిలో రాణిస్తూ రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిలో పేరు సంపాదించుకున్నారన్నారు. విద్యార్థుల భవిష్యత్ దిశానిర్దేశం చేయడంలో కీలకంగా పని చేశారని, ఎంతోమంది విద్యార్థులను ఉన్నతవంతులుగా తీర్చిదిద్దారని కొనియాడారు. పదవి విరమణ అనంతరం సమాజ సేవలో రాణించాలని కోరారు. అనంతరం రౌతు శ్రీదేవి మాధవరావు దంపతులను  ఉపాధ్యాయులు, రిటైర్డ్ ఉపాధ్యాయులు, వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు, మేధావులు, గ్రామస్తులు ఘనంగా శాలువాలతో సన్మానించారు.