13 July, 2026 | 5:27 PM

Breaking News

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో బెల్లంపల్లి క్రీడాకారులకు పతకాలు   •   బంజారా కమ్యూనిటీ హాల్‌కు స్థలం ఏర్పాటు చేయాలని కలెక్టర్‌కు వినతి   •   విద్యార్థుల ఆరోగ్యానికి భద్రత   •   ప్రాథమిక విద్యను మరింత బలోపేతం చేయాలి – జిల్లా కలెక్టర్ కె. హరిత   •   ఆల్బెండజోల్ మాత్రలు తీసుకోవడం ద్వారా నులిపురుగులను నివారించవచ్చు   •   విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ   •   ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్ కె.హరిత   •   కాంగ్రెస్ పార్టీలో 'జక్కిడి' మంటలు   •   లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల మంజూరు పత్రలు అందజేత   •   ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీ   •  

గ్రామ పంచాయతీల అభివృద్ధిలో వార్డు సభ్యుల పాత్ర కీలకం

16-02-2026 09:57 PM

- శిక్షణా కార్యక్రమంలో పంచాయతీరాజ్ డిప్యూటీ కమీషనర్ విద్యాలత

బూర్గంపాడు,(విజయక్రాంతి): ప్రతి గ్రామపంచాయతీలో జరిగే అభివృద్ధి, ప్రజాసమస్యల పరిష్కారంలో సర్పంచ్, ఉప సర్పంచ్ లతో పాటు వార్డు సభ్యుని పాత్ర కీలకమని పంచాయతీరాజ్ డిప్యూటీ కమీషనర్ విద్యాలత అన్నారు. సోమవారం మండల కేంద్రమైన బూర్గంపాడు రైతువేదికలో మండలంలోని వార్డుసభ్యులకు జరిగిన శిక్షణా కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు. సోమవారం నుంచి 20వ తేదీవరకు మొదటి బ్యాచ్ వార్డుసభ్యులకు, 23 నుంచి 27వ తేదీ వరకు రెండవ బ్యాచ్ లో వార్డుసభ్యులకు ఈ శిక్షణ నిర్వహించడం జరుగుతుందన్నారు.

ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో నూతనంగా వార్డు సభ్యులుగా గెలుపొందిన వారంతా ఆయా పంచాయతీల్లో అభివృద్ధికి సహకరిస్తూ వారి విధులు, విధానాలు, అధికారం, శానిటేషన్, స్ట్రీట్ లైట్లు, విద్య విధానంపై ఎలా వ్యవహరించాలి... ఐదేళ్లపాటు వారు చేపట్టే విధులు, పాటించాల్సిన అంశాలపై శిక్షణ ఇచ్చారు. గ్రామాలు అభివృద్ధి చెందాలంటే వార్డుసభ్యులు కీలకంగా మారి ఆయా వార్డులో ప్రజలు ఎదుర్కొనే సమస్యలపై దృష్టి సారించి సర్పంచ్, ఉపసర్పంచ్ ల ద్వారా ఆ సమస్యలను ఎలా పరిష్కరించాలో అవగాహన కల్పించారు.

ఐదురోజుల పాటు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు శిక్షణ ఉంటుందని, ఈ శిక్షణలో వార్డుసభ్యులు పంచాయతీ పాలనపై అవగాహన పెంచుకోవాలన్నారు. అనంతరం ఆమె వార్డుసభ్యులకు మెటీరియల్ ను అందజేశారు. ఈ శిక్షణా కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి సుధీర్ కుమార్, డిప్యూటీ సీఈవో చంద్రశేఖర్, ఎంపీడీవో జమలారెడ్డి, ఎంపీవో బాలయ్య, ఆయా పంచాయతీల వార్డు సభ్యులు పాల్గొన్నారు.