24 March, 2026 | 6:36 AM

పోలీస్ కస్టడీకి రోహిత్‌రెడ్డి

24-03-2026 12:17 AM
  1. ఆయనతో రితేష్‌రెడ్డి, నమిత్‌శర్మల విచారణకు కోర్టు అనుమతి
  2. మూడు రోజుల పాటు విచారించనున్న సిట్

హైదరాబాద్ సిటీ బ్యూరో, మార్చి 23 (విజయక్రాంతి): మొయినాబాద్ ఫామ్‌హౌస్ డ్రగ్ కేసులో అరెస్టయిన మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డితో పాటు ఆయన సోదరుడు పంజుగుల రితేష్‌రెడ్డి, నమిత్‌శర్మలను పోలీసుల కస్టడీకి కోర్టు అనుమతించింది. ప్రస్తు తం చంచల్‌గూడ జైలులో రిమాండ్‌లో ఉన్న ఈ ముగ్గురు నిందితులను మూ డు రోజులపాటు విచారించేందుకు న్యా యస్థానం అనుమతిచ్చింది.

శుక్రవారం సాయంత్రం నుంచి ఈ నెల 26 వరకు నిందితులు పోలీసుల కస్టడీలో ఉండనున్నారు. ఈ 72 గంటల వ్యవధిలో నిందితుల నుం చి కీలకమైన సమాచారాన్ని రాబట్టడం ద్వారా కేసులోని మిస్టరీని ఛేదించాలని సిట్ అధికారులు వ్యూహరచన చేశారు. ఈ విచారణలో పోలీసు లు ప్రధానంగా మూడు అంశాలపై దృష్టి సారించనున్నారు.

కాల్పులు జరగడానికి గల కార ణాలేమిటి, ఆయుధా లు ఎక్కడి నుంచి వచ్చాయన్న కోణం లో రోహిత్‌రెడ్డిని నిలదీయనున్నారు. డ్రగ్స్ పార్టీ వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏమిటి, ఆ పార్టీకి మత్తు పదార్థాలను ఎవరు సరఫరా చేశారో తెలు సుకోను న్నారు. ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్‌కు ఈ పార్టీతో ఉన్న సంబంధం ఏమిటనే దానిపై సిట్‌లోతు గా దర్యాప్తు చేయనుంది. చంచల్‌గూడ జైలు నుంచి నిందితులను కస్టడీలోకి తీసుకున్న వెంటనే,  రహస్య ప్రాంతానికి తరలించి విచారించనున్నారు.