ధాన్యం కొనుగోళ్లకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి
- గత సీజన్ పొరపాట్లు పునరావృతం కాకూడదు
- అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి
రంగారెడ్డి, ఆగస్టు 13 (విజయక్రాంతి): ఖరీఫ్ సీజన్లో ధాన్యం కొనుగోళ్లను సజావు గా, పారదర్శకంగా నిర్వహించేందుకు పకడ్బందీ ముందస్తు ఏర్పాట్లు చేపట్టాలని అద నపు కలెక్టర్ చంద్ర రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులు, రైస్ మిల్లర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గత సీజన్లో ఎదురైన లోపాలు, జాప్యాలు ఈసా రి పునరావృతం కాకుండా ముందస్తు చర్య లు తీసుకోవాలని స్పష్టం చేశారు.
జిల్లాలో ఈ సీజన్లో సుమారు 20,000 మెట్రిక్ ట న్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా డిఆర్డిఓ, డి సీఓ శాఖల ఆధ్వర్యంలో 33 కొనుగోలు కేం ద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కేం ద్రాల వద్ద రైతులకు ఇబ్బంది కలగకుండా తాగునీరు, షెడ్లు, విద్యుత్, సరిపడా గన్నీ బ్యాగులు, తూకం యంత్రాలను సిద్ధం చే యాలని ఆదేశించారు.
ధాన్యం నాణ్యత పరిశీలన, తూకం వేయడం, రైస్ మిల్లులకు త రలించే ప్రక్రియలను వేగవంతంగా పూర్తి చే యాలన్నారు. అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ రైతుల సమస్యలను తక్షణమే పరి ష్కరించాలని సూచించారు. సమావేశంలో జిల్లా అధికారులు, మిల్లర్లు పాల్గొన్నారు.






