14 August, 2026 | 1:32 AM

ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయాలి

14-08-2026 12:33 AM

ఐడీపీఎల్ చౌరస్తాలో తిరంగా ర్యాలీలో ఎంపీ ఈటల రాజేందర్

కుత్బుల్లాపూర్, ఆగష్టు 13 (విజయక్రాంతి): ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు ప్రతీ ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయాలని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ పిలుపునిచ్చారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు మేడ్చల్‌మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని ఐడీపీఎల్ చౌరస్తాలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన తిరంగా ర్యాలీ లో మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ విభిన్న జాతులు, సంస్కృతులు, భాషలు ఉన్నప్పటికీ కలిసి జీవించే దేశం భారతదేశమని అన్నారు. మనందరం భారతమాత ముద్దుబిడ్డలమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ అర్బన్ జిల్లా అధ్యక్షులు గిరివర్ధన్ రెడ్డి, సీనియర్ నాయకులు, ఇంచార్జి మల్లారెడ్డి, వడేపల్లి రాజేశ్వర్ రావు, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కొల్లి మాధవి, జిల్లా జనరల్ సెక్రెటరీ విగ్నేష్, జిల్లా ఓబీసీ అధ్యక్షులు శేఖర్ యాదవ్, మాజీ కార్పొరేటర్ శేషగిరి రావు, కూకట్పల్లి అసెంబ్లీ ఇంచార్జ్ కాంత రావు, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.