31 July, 2026 | 1:09 AM

వర్షం హోరు... జనం బేజారు!

31-07-2026 12:47 AM
  1. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం
  2. ఆయా చోట్ల చెరువులను తలపించిన రోడ్లు
  3. ఇళ్లలోకి చేరిన వరద నీరు
  4. పలు గ్రామాల మధ్య బ్రిడ్జిలు మునక... రాకపోకలు బంద్ 

ధర్మపురి,జూలై30(విజయక్రాంతి):బుధవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కు రుస్తున్న వర్షానికి ఆయా చోట్ల రోడ్లు మొ త్తం చెరువులుగా తయారయ్యాయి. వాగు లు వంకలు పొంగి పొర్లుతున్నాయి. మండలంలోనీ అన్ని గ్రామాల్లో ఎక్కడ చూసినా వ రద నీరు వెల్లువెత్తుతుంది. ఎడతెరిపి లేకుం డా కురుస్తున్న కుండ పోత వర్షానికి కాలనీల్లో రోడ్లపై వర్షపు నీరు నిలిచి చెరువులను తలపించేలా నీరు ప్రవహిస్తుంది. వెల్గటూర్ మండల కేంద్రంలో పలు కాలనీలు జలమయమయ్యాయి అలాగే పెద్దవాగు పొంగిపొ ర్లుతుంది.

స్థంభంపల్లి పెద్దచెరువు నిండడంతో నిండుకుండల సంతరించుకుంది. రాంనూర్,కప్పారావుట, పాశిగామ గ్రామాలలో వరద నీరు ఇళ్లలోకి చేరి వంట సామా గ్రి నీట మునిగి పోయింది. పైడిపల్లి - గోడిశెలపేట, ఎండపల్లి కొండాపూర్ గ్రామాల మధ్యలో ఉన్న వాగులోకి వరద నీరు చేరడంతో బ్రిడ్జి మునిగి రాకపోకలు నిలిచిపో యాయి. పాశిగామా గ్రామంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి బరుపటి రాజయ్య అనే వ్యక్తి ఇళ్లు కూలిపోయింది. కుమ్మరిపల్లి, స్థంభంపల్లీ, జగదేవుపేట, కోటిలింగాల ,మొక్కట్రావుపేట, ముత్తునూర్, చేగ్యాం,శాఖాపూర్, రాజక్కపల్లి, పైడిపల్లి, గ్రామాల్లో పత్తి, పంట చేనులు నీట మునిగిపోయాయి.

నీట మునిగినా రోడ్లు..

మంగళవారం రాత్రి నుంచి కురుస్తున్న బారీ వర్షం తో మండలంలోనీ పలు గ్రామాల్లో రోడ్లన్నీ నదులను తలపించాయి. డ్రైనేజీ లు ఉప్పొంగి మురుగు నీరు ఏరులై పారింది. లోతట్టు ప్రాంతాల్లోనీ కాలనీలు నదులను తలపించాయి.

‘డీ53 కెనాల్లో బ్లాకేజీ.. తొలగింపునకు చర్యలు

వెల్గటూర్ మండల కేంద్రంలోని ఎస్సారెస్పీ డీ-53 కెనాల్లో వర్షపు నీరు, చెత్త కార ణంగా ఏర్పడిన బ్లాకేజీని ఎంపీఓ కృపాకర్, ఇరిగేషన్ ఏఈ ప్రవీణ్, సర్పంచ్ బండమీది కవిత గోపి గురువారం పరిశీలించారు. కోటిలింగాల కమాన్ వద్ద కెనాల్ను మూసివేసి ఏ ర్పాటు చేసిన షాపుల కారణంగా నీటి ప్రవాహానికి ఆటంకం ఏర్పడుతున్నట్లు గుర్తించా రు. సంబంధిత నిర్వాహకులకు సమాచారం ఇచ్చి, జేసీబీ సహాయంతో కెనాల్లోని బ్లాకేజీ లను తొలగించారు.

అత్యవసరం ఉంటే తప్ప బయటకు రావొద్దు : ఎస్‌ఐ పి. ఉదయ్ కుమార్

వర్షం కారణంగా ప్రధాన రహదారులపై నీరు నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతున్నదని, వాహ నదారులు,తగిన జాగ్రత్తలు తీసుకోవాలని స్థానిక ఎస్ ఐ ఉదయ్ కుమార్ ప్రజలకు వి జ్ఞప్తి చేశారు. అత్యవసర పనులు ఉంటేనే త ప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని, ప్రయాణం తప్పనిసరి అయితే వాహనాల ను నెమ్మదిగా నడపాలని ఆయన తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు, వర్షం కురుస్తున్న సమయంలో అత్యవసరం అయితే తప్ప ఇళ్లనుంచి బయటకు రావద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పోలీస్ శాఖ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటుందనీ, ఆందోళన చెందో ద్దనీ, సహాయక చర్యలకు తమ సిబ్బంది సం సిద్ధంగా ఉన్నట్లు ఈ సందర్భంగా ఎస్త్స్ర ఉదయ్ కుమార్ పేర్కొన్నారు.

గోదావరికి కొత్త కళ... మంథనిలో తొణికిసలాడుతున్న ఆనందం

మంథని, జూలై 30(విజయ క్రాంతి) గత రెండు నెలలుగా సరైన వర్షాలు లేక, సుదీర్ఘ నిరీక్షణ తర్వాత గోదావరి తల్లి మళ్లీ రూపుమార్చుకుంది. నిన్నమొన్నటి వరకు నీళ్లు లేక ఎడారిలా వెలవెలబోయిన గోదావరి తీరం, ఇప్పుడు తుఫాన్ ప్రభావం కారణంగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల ధాటికి నిండుకుండలా మారడంతో మంథ ని ప్రాంతమంతా పండగ వాతావరణం సంతరించుకుంది.పరవళు తొక్కుతున్న ప్ర కృతి సోయగంతో రైతులు, ప్రజలు ఆనం ద వ్యక్తం చేస్తున్నారు.

ఎగువన పడుతున్న వ ర్షాలతో ఉప్పొంగి ప్రవహిస్తున్న గోదావరి అందాలు చూసేందుకు స్థానికులు నదీ తీరానికి క్యూ కడుతున్నారు. అలల సవ్వడులు, ఉరకలేస్తున్న వరద నీటితో నదీ తీరం కనువిందు చేస్తోంది. నదికి మళ్లీ పూర్వవైభవం రావడంతో ప్రకృతి ప్రేమికులు, మంథని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.నదిలోకి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో ఈ ప్రాంత వ్యవసాయ రంగానికి పెద్ద ఊరట లభించింది. నీటి కొరత తీరడంతో వరితో పాటు ఇతర పంటలు సమృద్ధిగా పండుతాయని రైతన్నలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. గోదావరి నిండుగా ప్రవహిస్తుండటంతో భూగర్భ జలాలు గణనీయంగా పెరిగి, రాబోయే రోజుల్లో తాగునీటి ఎద్దడి తప్పుతుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

వర్షాలకు మళ్లీ దెబ్బతిన్న మామిడిపల్లి వంతెన..

కోనరావుపేట, జూలై 30 (విజయక్రాంతి):కోనరావుపేట మండలం మామి డిపల్లి గ్రామంలోని మూలవాగుపై ఉన్న వంతెన మరోసారి కురిసిన భారీ వర్షాలకు దెబ్బతింది. దీంతో గ్రామానికి మండల కేం ద్రానికి మధ్య రాకపోకలు తీవ్రంగా అంతరా యం కలిగి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.దశాబ్ద కాలంగా వర్షం వచ్చి న ప్ర తిసారి వంతెనకు అనుసంధానంగా ఉన్న ర హదారి కొట్టుకుపోతుండగా, అధికారులు తాత్కాలిక మరమ్మతులతోనే సమస్య ను పరిష్కరిస్తున్నారని గ్రామస్తులు ఆవేదన వ్య క్తం చేశారు. శాశ్వత వంతెన నిర్మిస్తామని అధికారులు, ఎన్నికల సమయంలో ప్రజాప్రతినిధులు పలుమార్లు హామీలు ఇచ్చినా ఇ ప్పటివరకు అమలు కాలేదని విమర్శించా రు.

ప్రతి వర్షాకాలంలో ఇదే పరిస్థితి పునరావృతం కావడంతో విద్యార్థులు, రైతులు, అ త్యవసర సేవల కోసం వెళ్లే ప్రజలు తీవ్ర ఇ బ్బందులు పడుతున్నారని తెలిపారు.ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి స మస్యను శాశ్వతంగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చొరవ తీసుకుని మామిడిపల్లి మూలవాగుపై శాశ్వత వంతెన నిర్మాణం చేపట్టేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరారు.

భారీ వర్షాల కారణంగా రోడ్ల పైన పడిపోయిన చెట్లు 

జగిత్యాల/కోరుట్ల ,జూలై30 (విజయక్రాంతి) జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పలుచోట్ల రహదారులపై చెట్లు కూలిపోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సమాచారం అం దుకున్న వెంటనే జగిత్యాల జిల్లా పోలీసులు సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుని చెట్లను తొలగించి ట్రాఫిక్ను యథావిధిగా పు నరుద్ధరించారు.బుగ్గారం పోలీస్ స్టేషన్ పరిదిలోని గంగాపూర్ గ్రామంలో రహదారిపై చెట్టు కూలిపోవడంతో వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న

పోలీసులు చెట్టును తొలగించి వాహనాల రాకపోకలకు మార్గాన్ని పు నరుద్ధరించారు అలాగే కొండగట్టు మండ లం రాజారం గ్రామ సమీపంలోని హైవే రహదారిపై రెండు చెట్లు కూలిపోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సంబంధిత శాఖల సిబ్బందితో కలిసి చెట్లను తొలగించి హైవేను పూర్తిగా క్లియర్ చేశారు. భారీ వర్షాల సమయంలో అత్యవసరం అయితే తప్ప ప్రయాణాలు చేయవద్దని, రహదారులపై చెట్లు, విద్యుత్ స్తంభాలు లేదా ఇతర అడ్డంకులు కనిపించిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్కు లేదా డయల్100కు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.