1 March, 2026 | 6:42 PM

రోడ్డు పక్కన చెట్ల తొలగింపు

01-03-2026 04:15 PM

కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): ఆసిఫాబాద్ మండలంలోని రాజుర గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి ఇరువైపులా పెరిగిన పిచ్చి మొక్కలు, తుమ్మ చెట్లను మోతుగూడ గ్రామ పంచాయతీ సర్పంచ్ బొట్టుపల్లి గోపాల్ ఆదేశాల మేరకు ఆదివారం వార్డు సభ్యుడు బోయిరే రాజేందర్, పంచాయతీ సిబ్బంది జేసీబీ సహాయంతో చెట్ల తొలగింపు పనులు చేపట్టారు.

ఈ సందర్భంగా సర్పంచ్ గోపాల్ మాట్లాడుతూ... రహదారి ఇరువైపులా అధికంగా పెరిగిన చెట్లు, మొక్కలు వాహనదారులు, ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయని, ప్రమాదాలకు కూడా ఆస్కారం ఉండటంతో ప్రయాణికుల భద్రత, సౌకర్యార్థమే ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.