1 March, 2026 | 6:26 PM

భక్తిశ్రద్ధలతో గాయత్రి మహా యజ్ఞ పూర్ణాహుతి

01-03-2026 04:12 PM

కాగజ్ నగర్,(విజయక్రాంతి): కాగజ్ నగర్ పట్టణంలోని న్యూ కాలనీలో ఆదివారం గాయత్రి మందిరంలో వైభవంగా 24 కుండముల గాయత్రి మహా యజ్ఞ పూర్ణాహుతి కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి హాజరైన సిర్పూర్ శాసనసభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు మాట్లాడుతూ... గాయత్రి పరివారం గొప్ప ఆధ్యాత్మిక  సమూహంగా ఎదిగి ప్రజల్లో వైదిక మరియు ఆధ్యాత్మిక సౌరభాలను పెంపొందిస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ ఈర్ల విశ్వేశ్వర్ రావు, ఎస్పీయం జిఎం మాజేటి అనిల్ కుమార్, నాయకులు పొలాడి హనుమంతరావు, రామకృష్ణ, లోకేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.