సఖి మహిళా మండలి నిరసన
నేషనల్ ఫౌండర్ అండ్ చైర్మన్ నరాల సత్యనారాయణ..
చుంచుపల్లి,జూలై 17(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో(Bhadradri Kothagudem District) తండ్రిని కోల్పోయి తల్లి రెక్కల కష్టాన్ని నమ్ముకుని జీవిస్తున్న 14 ఏళ్ల బాలికపై ముగ్గురు కామాంధులు దారుణానికి పాల్పడ్డారు. బాలిక అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకొని ప్రేమ పేరుతో వంచించి ఒకడు లైంగిక దోపిడీకి పాల్పడగా, ఈ విషయం నలుగురికి చెబుతామని బెదిరించి మరో ఇద్దరూ అత్యాచారానికి పాల్పడిన ప్రకటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం కొత్తగూడెంలో జరిగింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు నలుగురిని అరెస్టు చేయగా ఇద్దరు పరారీలో ఉన్నారనీ అన్నారు.
ఈ సందర్భంగా నరాల సత్యనారాయణ మాట్లాడుతూ, త్వరలోనే ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర ధర్నా నిర్వహిస్తామని అనంతరం కేంద్ర మంత్రులను కలుస్తామని తెలియజేశారు. అదేవిధంగా భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ను కోరుతామని, హోం శాఖ మంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ కోరి పార్లమెంటులో బలమైన చట్టాలు తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేస్తామని, మహిళలపై అత్యాచారానికి పాల్పడితే ఫారెన్ లో ఉరి తీసే విధం,గా భారత దేశంలో కూడా చట్టాలు రావాలని ఆ చట్టాలు తెచ్చే విధంగా సఖి మహిళా మండలి పోరాడుతుందని నరాల సత్యనారాయణ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సఖి మహిళా మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.






