23 March, 2026 | 3:55 PM

Breaking News

మట్టి నిల్వతో రోడ్డు బ్లాక్

23-03-2026 02:25 PM

- ఇబ్బందులు పడుతున్న వాహనదారులు

బెజ్జంకి,(విజయక్రాంతి: సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో తహసిల్దార్ కార్యాలయం వెళ్ళు రోడ్డుపై అక్రమంగా మట్టి నిలువ చేయడంతో పలువురు వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.వివిధ పనులకు ప్రభుత్వా కార్యాలయాలకు వెళ్ళడానికి ప్రజలు నాన అవస్థలకు గురవుతున్నారు. రోడ్డుపై అక్రమంగా నిల్వ చేసిన మట్టి పై అధికారులు చూసి చూడనట్టు వ్యవహరించడం చర్చనీయాంశంగా మారింది. అధికారులు స్పందించి తక్షణం మట్టి నిల్వలను తొలగించాలని వాహనదారులు కోరుతున్నారు.