6 May, 2026 | 7:45 PM

Breaking News

పెళ్లి రోజు సందర్భంగా ఎల్లమ్మ, మహంకాళి అమ్మవార్లను దర్శించిన తలసాని దంపతులు   •   జవహర్ నగర్‌లో గృహిణి అదృశ్యం   •   గిరిజన ప్రాంతాలలో అమలు చేస్తున్న కార్యక్రమాల లక్ష్యాలను సాధించాలి   •   శ్రీమరకత ఆత్మలింగేశ్వర స్వామి దివ్య ప్రతిష్ట మహోత్సవానికి ఆహ్వానం అందజేత   •   వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ అవకాశాలపై అవగాహన సదస్సు   •   ఆర్టీసీ సూపర్వైజర్ కాలనీలో ఘనంగా అభయ ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్టాపన   •   నాగోల్‌లో స్టార్మ్ వాటర్ డ్రెయిన్ నిర్మాణ పనుల వేగం పెంచాలి   •   పెంచిన ధరలను వెంటనే తగ్గించాలి - సిపిఐ   •   పంటల మార్పిడి విధానాన్నీ రైతులు అవలంబించాలి   •   కులర్ కరెంట్ షాక్‌తో బాలుడికి గాయాలు   •  

పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్‌వేపై రోడ్డు ప్రమాదం

20-12-2025 12:24 PM

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం పీవీ ఎక్స్ ప్రెస్ వేపై(PVNR Expressway) రోడ్డు ప్రమాదం జరిగింది. పిల్లర్ నంబర్ 253 వద్ద మూడు కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ప్రమాదంలో పలువురికి గాయాలు కావడంతో తక్షణమే సమీప ఆస్పత్రికి తరలించారు. ఉప్పర్ పల్లి నుంచి ఆరంఘర్ చౌరస్తా(Upparpally to Aramghar Chowrasta) వరకు ట్రాఫిక్ జామ్ అయింది. భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రంగంలోకి దిగిన పోలీసు సిబ్బంది ట్రాఫిక్ ను క్లియర్ చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.