10 April, 2026 | 3:32 AM

ఏసీబీకి పట్టుబడిన ఆర్‌ఐ

10-04-2026 01:41 AM

ధరణిలో పేరు నమోదుకు రూ.10 వేలు డిమాండ్

అంతర్గం తహసీల్దార్ కార్యాలయంలో ఘటన

పెద్దపల్లి /అంతర్గాం, ఏప్రిల్ 9 (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ ఇన్స్‌పె క్టర్ సేడంక శ్రీమన్ ఒక రైతు వద్ద రూ.10 వే లు లంచం తీసుకుంటూ గురువారం ఏసీబీకి పట్టుపడ్డాడు. ఏసీబీ డీఎస్పీ విజయ్‌కుమార్ తెలిపిన వివరాల మేరకు ఆర్‌ఐ శ్రీమన్ ఒక రైతు అతని తల్లి పేరుపై గల 5 1/2 ఎకరాల భూమి వారి కాస్తులో ఉన్నప్పటికీ అదే గ్రామా నికి చెందిన గుమ్ముల చంద్రయ్య పేరుపైన ధరణిలో నమోదై ఉంది.

దీంతో ఆమె పేరు పైకి ధరణిలో నమోదు చేయడం కోసం ఫీల్ ఎంక్వయిరీ చేసి తహసీల్దార్ తూము రవీందర్ పటేల్‌కు రిపోర్ట్ అందజేయడం కోసం ఆ రైతునుంచి 10వేల రూపాయలను లంచంగా తీసుకునే క్రమం లో తమ సిబ్బందితో ట్రాప్ చేసి పట్టుకున్నామని ఏసీబీ డీఎస్పీ తెలిపారు. కాగా గత సంవత్సరం తహసీల్దార్, ఆర్‌ఐ లం చం తీసుకునే క్రమంలో ఏసీబీకి పట్టుపడ్డారు. అయినప్పటికీ అక్కడ విధులు నిర్వహించే అధికారులు ఎలాంటి భయం లేకుండా, రైతు ల నుంచి పైసలు వసూలు చేస్తూ ఇబ్బం దులకు గురి చేస్తున్నారని తెలుస్తుంది. అధికా రుల వేధింపులతోనే రైతులు ఏసీబీని ఆశ్రయి స్తున్నట్లు కనిపిస్తుంది.