రుమటాలజీ డిసీజెస్ అవేర్నెస్ వాక్
ఇండియన్ రుమటాలజీ అసోసియేషన్, స్టార్ ఆసుపత్రి ఆధ్వర్యంలో నిర్వహణ
హైదరాబాద్, ఏప్రిల్ 26 (విజయక్రాంతి): రుమటాలాజీ వ్యాధులను తొందరగా గుర్తించి, సమయానికి చికిత్స చేసుకోవడం అత్యంత ముఖ్యమని ‘ఇండియన్ రుమటాలజీ అసోసియేషన్, స్టార్ ఆసుపత్రి హైదరా బాద్’ ప్రముఖ వైద్యులు తెలిపారు. ప్రజల్లో రుమటాలజీ సంబంధిత వ్యాధులపై అవగాహన పెంపొందించేందుకు ఆదివారం ‘రు మటాలజీ డిసీజెస్ అవేర్నెస్ వాక్’ను నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రముఖ వైద్య నిపుణులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. రుమటాలజీ అసోసియేషన్ హైదరా బాద్ అధ్యక్షుడు డాక్టర్ ఐఆర్ వరప్రసాద్, కార్యదర్శి డాక్టర్ రాజ్ కిరణ్ దుడం, నిమ్స్ డీన్ అండ్ హెచ్ వోడీ డాక్టర్ లిజా రాజశేఖర్, జాయింట్ సెక్రెటరీ డాక్టర్ హెచ్‌ఆర్ మాధురిలు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. రుగ్మతలకు సంబంధించిన పలు చికిత్సా విధానాలు, జాగ్రత్తలు వివరించారు.
రుమటాలజీ వ్యాధులు నిశ్శబ్దంగా జీవితాన్ని ప్రభావితం చేస్తాయని, వీటిపై నిర్ల క్ష్యం తగదన్నారు. సరైన సమయంలో చికి త్స తీసుకోవాలన్నారు. దేశంలో దీని ప్రభా వం ఎక్కువగా ఉన్నా, అవగాహన తక్కువగా ఉందని వ్యాధి నిర్ధారణ, సరైన చికిత్స, రోగులకు అవగాహన కల్పించేందుకు ఈ వాక్ అని వివరించారు. సంవత్సరాల తరబడి ఈ వ్యాధిని గుర్తించడం లేదని, గుర్తిస్తే నియంత్రణ, చికిత్స సాధ్యమన్నారు. రుమటిక్ వ్యాధులు యువతలోనూ కనిపిస్తాయని, ల క్షణాలను గుర్తించి సరైన చికిత్స తీసుకుంటే సాధారణ జీవితం గడపడం సాధ్యమేనని పేర్కొన్నారు. పలువురి ప్రశ్నలు, అనుమానాలుక వైద్యులు సమాధానమిచ్చి నివృత్తి చేశారు.
అవగాహన ఎందుకు అవసరం?..
రుమటాలజీ వ్యాధులు సాధారణంగా గుర్తించరు, అర్థం చేసుకోరు. దీంతో నిర్ధారణ ఆలస్యమై వ్యాధి తీవ్రతరం అవుతుంది. వృద్ధులకు మాత్రమే కాకుండా పిల్లలు సహా అన్ని వయస్సుల వారిని ఈ వ్యాధి ప్రభావితం చేస్తుంది. భారతదేశంలో ప్రతి ఐదు మందిలో ఒకరికి మస్కులోస్కెలెటల్, రుమటిక్ సమస్యలు ఉండే అవకాశం ఉంది. ఆర్థరైటిస్‌తో దేశంలో 18 కోట్ల మందికిపైగా ప్రభావితమయ్యారు.
రుమటాయిడ్ ఆర్థరైటిస్, లూపస్, యాంకిలోసింగ్ స్పాండిలైటి స్, సోరియాటిక్ ఆర్థరైటిస్ వంటి వ్యాధులు ముందస్తు చికిత్స లేకపోతే వికలాంగత్వానికి దారితీస్తాయి. తొందరగా గుర్తిస్తే కీళ్ల నష్టం తగ్గించి, నొప్పిని నియంత్రించవచ్చు. ప్రజ ల్లో అవగాహన లేమితో వైద్యుడిని సంప్రదించడంలో ఆలస్యం చేస్తున్నారు. దీంతో వ్యాధి తీవ్రత పెరుగుతుంది. ఈ అవేర్‌నెస్ వాక్‌లో 200 మందికి పైగా పాల్గొన్నారు. మనిషిలో శారీరక చురుకుదనం, కీళ్ల ఆరోగ్యానికి ఎంత ముఖ్యమో తెలిపారు.
స్టార్ ఆసుపత్రి హైదరాబాద్‌లో చికిత్సలు..
17 ఏళ్ల అనుభవం, 11 ప్రత్యేక కేంద్రాలు, కార్డియాక్ సైన్సెస్, ఆర్థోపెడిక్స్, గ్యాస్ట్రో ఇంటెస్టినల్ కేర్, న్యూరోసైన్సెస్, రోబోటిక్ మోకాలి మార్పిడి శస్త్రచికిత్సలు, క్యాన్సర్ కేర్, రెనల్ సైన్సెస్, మల్టీ ఆర్గన్ ట్రాన్స్‌ప్లాంట్ ప్రోగ్రామ్, ఎమర్జెన్సీ మెడిసిన్, మినిమల్ ఇన్వేసివ్ సర్జరీలు, ప్లాస్టిక్, రీకన్‌స్ట్రక్షన్ అండ్ ఏస్థెటిక్ సర్జరీ, 35కు పైగా సూపర్ స్పెషాలిటీలు, 200కు పైగా నిపుణులైన వైద్యులు, 600కు పైగా పడకల సామర్థ్యం కలిగి ఉంది.






