27 April, 2026 | 3:20 AM

పట్టాలెక్కేదెప్పుడు?

27-04-2026 01:54 AM

మెట్రో ఫేజ్-2 విస్తరణపై ఇప్పటికే కేంద్రానికి ప్రతిపాదనలు

  1. కేంద్ర ప్రభుత్వం ఆమోదంపై ఉత్కంఠ
  2. మే 1 నుంచి ప్రభుత్వం ఆధీనంలోకి మెట్రో
  3. ఇప్పటికైనా వేగవంతం అవుతుందా అని చర్చ
  4. విస్తరణను ఆమోదించడంలో జాప్యమెందుకని ప్రశ్నలు
  5. ట్రాఫిక్ నుంచి ఉపశమనం కోసం ప్రజల ఎదురుచూపు

హైదరాబాద్, ఏప్రిల్ 26 (విజయక్రాంతి): హైదరాబాద్ నగరంలో రోజురో జుకూ ట్రాఫిక్ పెరుగుతుండటంతో ప్రయాణికులకు కొంత మేర మెట్రో రైలు ఉపశ మనాన్ని కల్పిస్తున్నది. అయితే నగరంలో ట్రాఫిక్ సమస్యకు పరిష్కార మార్గంగా భావిస్తున్న మెట్రో విస్తరణపై తాజాగా మరోసారి విస్తృత చర్చ జరుగుతున్నది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 76.4 కిలోమీటర్ల విస్తరణకు ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వానికి అందజేసింది.

కానీ దానికి ఆమోదంపై మాత్రం ఇంకా స్పష్టత రాకపోవడం ఉత్కంఠను పెంచుతున్నది. ఇదే సమయంలో మే 1 నుంచి మెట్రోను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోబోతుండటం తో ఈ అంశం ప్రాధాన్యతను మరింత పెంచింది. ఒకవైపు ట్రాఫిక్ సమస్యలు భరించలేని స్థాయికి చేరుకోవడం, మరోవైపు మెట్రో విస్తరణపై నిర్ణయం ఆలస్య మవుతుండటం నగర ప్రజల్లో అసహనం పెంచుతున్నాయి.

ఫేజ్--2 అమలైతే ఐటీ కారిడార్లు, కీలక రవాణా మార్గాలు మెట్రో నెట్‌వర్క్‌కు అనుసంధానం కావడంతో ట్రాఫిక్ ఒత్తిడి గణనీయంగా తగ్గే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. కానీ, కేంద్ర ఆమోదం ఎప్పుడొస్తుందన్న అనిశ్చితి ప్రాజెక్ట్ భవిష్యత్తుపై సందేహాలను రేకెత్తిస్తున్నది. ఇప్పటికైనా గ్రీన్ సిగ్నల్ ఇస్తారా? లేక ఈ ప్రాజెక్ట్ ఇంకా ఆలస్యమవుతుందా అనే ప్రశ్నలు ప్రజల్లో తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి.

కేంద్ర ఆమోదం ఆలస్యమెందుకు?

నగర ట్రాఫిక్ సమస్యలకు దీర్ఘకాలిక పరిష్కారంగా భావిస్తున్న మెట్రో రైల్ ఫేజ్--2 ప్రాజెక్టుకు కేంద్ర ఆమోదం ఆలస్యం కావ డం చర్చనీయాంశంగా మారింది. ప్రాజెక్ట్‌కు సంబంధించిన భారీ వ్యయం కారణంగా కేంద్రం కొంత జాగ్రత్తగా వ్యవహరిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కేంద్ర, -రాష్ట్ర భాగస్వామ్యం, రుణాల సమీకరణ, ప్రైవేట్ పెట్టుబడులపై ఇంకా స్పష్టత అవసరమని తెలుస్తున్నది. ఇక డీపీఆర్‌లోని కొన్ని సాంకేతిక అంశాలపై కేంద్రం అదనపు వివరాలు కోరినట్టు సమాచారం.

ముఖ్యంగా రూట్ ఎంపిక, ప్రయాణికుల అంచనాలు, ఆదాయ వనరులపై సమగ్ర పరిశీలన కొనసాగుతున్నది. దేశవ్యాప్తంగా అనేక మెట్రో ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉండటం, బడ్జెట్ పరిమితులు కూడా నిర్ణయ ప్రక్రియను ప్రభావితం చేస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మెట్రో రైల్ ఫేజ్-2 ప్రాజెక్ట్‌కు కేంద్ర ఆమోదం ఎప్పుడు వస్తుందన్నదే ప్రస్తుతం ప్రధాన చర్చగా మా రింది. అయితే తాజా పరిణామాలు ఆశలు రేకెత్తిస్తున్నాయి.

మే 1 నుంచి మెట్రో నిర్వహణను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకునే నిర్ణయం నేపథ్యంలో, విస్తరణ ప్రాజెక్ట్‌పై మళ్లీ దృష్టి కేంద్రీకృతమైంది. దీంతో కేంద్రం కూడా త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలు, ప్రజల నుంచి వస్తున్న ఒత్తిడి కూడా కేం ద్రంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. దీంతో ఇప్పటికైనా మెట్రో ఫేజ్--2కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా? అని ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

ప్రభుత్వ స్వాధీనం తర్వాత అయినా.. 

మెట్రో రైల్ నిర్వహణను మే 1 నుంచి రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకునే నేపథ్యంలో ఫేజ్-2 సంబంధించి కేంద్ర ప్రభు త్వం ఆమోదంపై మరింత ప్రాధాన్యం సంతరించుకున్నది. కనీసం రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలోకి వచ్చిన తర్వాత అయినా ఫేజ్ 2 అనుమతుల ప్రక్రియ వేగవంతమవుతుందా? అనే చర్చ మొదలైంది. ప్రస్తుతం ప్రైవేట్ భాగస్వామ్యంతో నడుస్తున్న మెట్రో ను ప్రభుత్వ నియంత్రణలోకి తీసుకురావడం వల్ల నిర్వహణలో పారదర్శకత పెరు గుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.

అలాగే, విస్తరణ ప్రాజెక్టులు, ముఖ్యంగా ఫేజ్--2 అమలులో నిర్ణయాలు వేగంగా తీసుకునే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. మరోవైపు ఈ నిర్ణయం ఆర్థికపరమైన సవాళ్లను కూడా తీసుకురావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మెట్రో నిర్వహణ ఖర్చులు, రుణాల భారమంతా ప్రస్తు తం ప్రభుత్వంపైనే ఆధారపడి ఉంటాయి. ఆదాయ వనరులు సరిపోకపోతే, భారం మ రింత పెరిగే అవకాశముంది. ఈ నేపథ్యంలో మెట్రోను ప్రభుత్వ స్వాధీనం చేసుకోవడం కేవలం పరిపాలనా మార్పేనా? లేక ఫేజ్- విస్తరణకు వేగం తీసుకురాబోయే కీలక నిర్ణయమా? అన్నది ఆసక్తిగా మారింది.

ట్రాఫిక్ సమస్యలకు ఉపశమనం లభిస్తుందా?

మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా నగరమూ విస్తరిస్తున్నది. దీంతో సమాంతరంగా జనాభా పెరుగుదల, తద్వారా ట్రాఫిక్ కూడా పెరుగుతుంది. ఈ క్రమంలో మెట్రో రైల్ విస్తరణ ఎంతో కీలకంగా మారింది. ప్ర స్తుతం పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలకు మెట్రో రైల్ విస్తరణతో పరిస్కారం లభిస్తుందని ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఈ విస్తర ణ అమలైతే నగరంలోని కీలక మార్గాల్లో ట్రాఫిక్ గణనీయంగా తగ్గే అవకాశముందని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.

మెట్రో విస్తరణతో ప్రత్యేకం గా ఐటీ కారిడార్లు, కొత్తగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో వ్యక్తిగత వాహనాల వినియోగం తగ్గి రోడ్లపై రద్దీ తగ్గే అవకాశం ఉంది. రోజువారీ ప్రయాణ సమయం కూడా తగ్గి, ప్రజ లకు సౌకర్యవంతమైన రవాణా అందుబాటులోకి వస్తుంది. అయితే మెట్రో విస్తరణ ఒక్కటే పూర్తి పరిష్కారం కాదని నిపుణులు స్పష్టంచేస్తున్నారు.

బస్సు సేవల బలోపేతం, రోడ్డు విస్తరణ, ట్రాఫిక్ మేనేజ్మెంట్ మెరుగుదల వంటి చర్యలు కూడా సమాంతరంగా అమలు కావాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో మెట్రో ఫేజ్--2 అమలైతే ట్రాఫిక్ సమస్యలకు గణనీయ ఉపశమనం లభించే అవ కాశం ఉన్నప్పటికీ, ప్రణాళికతోనే దీర్ఘకాలిక పరిష్కారం సాధ్యమవుతుందని నిపుణులు చెబుతున్నారు.

మెట్రో ఫేజ్-2(ఏ)- 76.4 కిలోమీటర్లు (5 కారిడార్లు)

Fనాలోగ్ - శంషాబాద్  ఎయిర్‌పోర్ట్- 36.8 కి.మీ

F రాయదుర్గ్ - కోకాపేట్  నియోపోలీస్ - 11.6 కి.మీ

Fఎంజీబీఎస్ -  చాంద్రాయణగుట్ట - 7.5 కి.మీ

Fమియాపూర్ - పటాన్‌చెరు - 13.4 కి.మీ

Fఎల్బీనగర్ - హయత్‌నగర్  - 7.1 కి.మీ

ఫేజ్-2(బీ) - 86.1 కి.మీ (3 కారిడార్లు)..

Fశంషాబాద్ ఎయిర్‌పోర్ట్ -  ఫ్యూచర్ సిటీ - 39.6 కి.మీ

Fజేబీఎస్ - మేడ్చల్ -  24.5 కి.మీ

Fజేబీఎస్ - శామీర్‌పేట్ -  22 కి.మీ