24 July, 2026 | 5:30 PM

పాఠశాలలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు

24-07-2026 04:57 PM

గణపురం, జులై 24 (విజయక్రాంతి): మండల కేంద్రంలోని శ్రీ నారాయణ పాఠశాలలో తెలంగాణ సంస్కృతి సాంప్రదాయ పండుగ బోనాలు పర్వదినాన్ని ఘనంగా నిర్వహించారు. పాఠశాల విద్యార్థిని,విద్యార్థులు సాంప్రదాయ దుస్తులు ధరించి బోనాలను అందంగా అలంకరించి భక్తిశ్రద్ధలతో అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. అనంతరం విద్యార్థులు సాంస్కృతిక కళా ప్రదర్శనతో పాఠశాల ప్రాంగణం అంతా పండుగ వాతావరణం నెలకొల్పారు.

ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ నాగనబోయిన రవి  కరస్పాండెంట్ పోతుగంటి శశిధర చారి మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బోనాలు పండుగను ఆషాడ మాసంలో మహంకాళి, పోచమ్మ, ఎల్లమ్మ వంటి గ్రామదేవతలకు భక్తిశ్రద్ధలతో నైవేద్యం సమర్పిస్తూ అత్యంత వైభవంగా జరుపుకోవడం ద్వారా విద్యార్థుల్లో సంస్కృతి సంప్రదాయాల పట్ల గౌరవం మర్యాద పెరుగుతుందని బోనం అంటే భోజనం అని అమ్మవారికి సమర్పించే నైవేద్యంగా భావించడం ఈ పండుగ ప్రతీక అని తెలిపారు. ఈకార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ పోతుగంటి స్వప్న చారి, ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.