27 June, 2026 | 3:47 AM

నాగోల్‌లో బీజేపీ బూత్ ఇంచార్జీలు, బీఎల్‌ఎ- 2 సభ్యులతో సమీక్ష సమావేశం

27-06-2026 01:03 AM

నాగోల్, జూన్ 26 (విజయక్రాంతి): నాగోల్ డివిజన్ బీజేపీ పార్టీ కార్యాలయంలో రానున్న జూన్ 28న హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో నిర్వహించనున్న సన్నాహక సమావేశాన్ని విజయవంతం చేసే లక్ష్యంతో బూత్ ఇన్చార్జీలు, బిఎల్‌ఎ-2 సభ్యులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ పాల్గొననున్న కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు, ప్రతి బూత్ నుంచి కార్యకర్తలు, ప్రజలను అధిక సంఖ్యలో పాల్గొని ప్రతి బూత్లో పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు సన్నాహక సమావేశాన్ని విజయవంతం చేయడానికి ప్రతి కార్యకర్త సమన్వయంతో పనిచేయాలని నాయకులు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకుడు చింతల సురేందర్ యాదవ్, నాగోల్ డివిజన్ అధ్యక్షుడు పంగ శ్రీకాంత్, నాయకులు డప్పు రాజు, సంజీవ్ రెడ్డి, బాలకృష్ణ గౌడ్, పద్మ రెడ్డి, పంగ శ్యామ్ కుమార్, లయ శెట్టి చంద్రశేఖర్, వినోద్ రెడ్డి, సరస్వతి, రమేష్ రెడ్డి, గౌరీ, గీతారెడ్డి, రేణుక, నరేశ్ యాదవ్, మనోజ్, రాము, డివిజన్ ఇన్చార్జ్ నూతి శ్రీనివాస్తో పాటు బూత్ ఇన్చార్జీలు, బిఎల్‌ఏ -2 సభ్యులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.